నందమూరి హీరోల్లో బాలయ్య, తారక్ నుంచి వచ్చే సినిమాలకు భారీ స్థాయి అంచనాలు ఉంటాయి. కానీ, కళ్యాణ్ రామ్ సినిమాలకు ప్రేక్షకుల్లో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అయితే, బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ పై, ఆయన సినిమాలపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరిగింది. పైగా కళ్యాణ్ రామ్ బింబిసార తర్వాత సినిమా అయిన అమిగోస్.. డోపెల్‌గాంజర్స్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందని తెలియడంతో అంచనాలు భారీగా పెరిగాయి. కొత్త దర్శకుడైనా, సినిమా హిట్ అవుతుంది అనే గట్టి నమ్మకం ప్రేక్షకుల్లో వచ్చింది. మరి నేడు విడుదలైన ఈ అమిగోస్ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్ధాం..
కథ :
సిద్ధార్థ్.. (కళ్యాణ్ రామ్) హైదరాబాద్ లో తన తండ్రి బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో రేడియో జాకీ అయిన ఇషికా (ఆషికా రంగనాథ్)ను తొలి చూపుల్లోనే ప్రేమిస్తాడు. ఇదే సమయంలో మనుషులను పోలిన మనుషులు ఉంటారని, అందుకు ఓ వెబ్ సైట్ సాయం చేస్తుందని సిద్ధార్థ్ తెలుసుకుంటాడు. అచ్చం తనలా ఉండే మంజునాథ్.. మైఖేల్ అలియాస్ బిపిన్ ను కూడా కలుస్తాడు. వీరి సాయంతో ఇషికా తన ప్రేమలో పడేలా చేస్తాడు సిద్ధార్థ్. తర్వాత వీరికి ఎంగేజ్ మెంట్. సరిగ్గా అదే సమయంలో NIA అధికారులు మంజునాథ్ ను కాల్చి అరెస్ట్ చేస్తారు. అయితే మంజును NIA అధికారులు ఎందుకు కాల్చారు ? అసలు మైఖేల్ గతం ఏంటి ? మైఖేల్ నుంచి సిద్ధార్థ్.. మంజునాథ్ ఎలా తప్పించుకున్నారు ? అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ప్రస్తుత కాలంలో డెబ్యూ డైరెక్టర్స్ ను తక్కువ అంచనా వేయలేం. విభిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చి, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, సినిమా ప్రపంచాన్ని తమ వైపునకు తిప్పుకుంటున్నారు. ఉప్పెన సినిమాతో బుచ్చి బాబు, బింబిసారతో మల్లిడి వశిష్ట్ ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. ఇందులో బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ తోనే వచ్చింది. ఇప్పుడు అదే కళ్యాణ్ రామ్.. కొత్త దర్శకుడు రాజేంద్ర రెడ్డితో అమిగోస్ అనే సినిమా చేశాడు.
డోపెల్‌గాంజర్స్ కాన్సెప్ట్ తో సినిమా అని అనౌన్స్ చేసిన తర్వాత ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగాయి. తర్వాత కళ్యాణ్ రామ్ మూడు పాత్రలు చేస్తున్నాడని, అందులో ఒకటి విలన్ పాత్ర అని మేకర్స్ ప్రకటించిన తర్వాత ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే, ఈ విభిన్నమైన కాన్సెప్ట్ ను ప్రేక్షకులు మెచ్చి, ఈలలు వేసేలా తెరకెక్కించడంలో కొత్త డైరెక్టర్ రాజేంద్ర రెడ్డి విఫలమయ్యాడు.
కాన్సెప్ట్ ఒకటే ఇంట్రెస్టింగ్ గా ఉంటే సరిపోదు.. కథ, కథనం కూడా ఆసక్తికరంగా ఉండాలి. ప్రేక్షకులను థియేటర్ లో కూర్చోబెట్టేలా ఉండాలి. కానీ, అలా అమిగోస్ లేదు అని చెప్పొచ్చు. సినిమాలో కళ్యాణ్ రామ్ ను మూడు పాత్రల్లో చూపించారు. కానీ, ఫోకస్ మొత్తం మైఖేల్ పాత్రపైనే ఉంచారు. ఈ క్రమంలో మరో రెండు పాత్రలు తెలిపోయాయి. మరి మైఖేల్ పాత్రను అయినా పవర్ ఫుల్ గా చూపించారా అంటే అది లేదు. మైఖేల్ పాత్రను.. తన ఫ్లాష్ బ్యాక్ ను మరింత భయంకరంగా, పవర్ ఫుల్ గా చూపించాల్సిన అవకాశాలు ఉన్నా.. దాన్ని డైరెక్టర్ వినియోగించుకోలేదు.
సినిమా ప్రారంభంలో వచ్చే సన్నివేశాలు కొంత వరకు మెప్పిస్తాయి. దీని తర్వాత సినిమాకు ఎంతో ముఖ్యమైన మూడు పాత్రలు వచ్చిన తర్వాత అదే రోటీన్ స్టోరీ తెరపై కనిపిస్తోంది. ఇక లవ్ స్టోరీ ఉన్నా.. అది సినిమాపై పెద్దగా ప్రభావం చూపదు. ఆ ముగ్గురిలో ఒక్కరు నెగిటివ్ షేడ్స్.. మరో ఇద్దరు అమాయకులు. ఈ అమాయకులను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర మోసం చేయడం.. దాని నుంచి ఆ ఇద్దరు తప్పించుకోవడం. స్టోరీ మొత్తం ఇదే. ఇందులో మూడు పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఇస్తే మరింత బాగుండేదేమో. ముఖ్యంగా మంజునాథ్ అనే పాత్ర ఆటలో అరటిపండు అనే అని ఫిలింగ్ రాకా మానదు. మోసపోవడానికి ఒక పాత్ర ఉండాలి అని మంజు పాత్రను డైరెక్టర్ తీసుకున్నట్టున్నాడు.
అయితే సినిమా చూస్తున్న క్రమంలో ప్రేక్షకులు బోర్ ఫీలింగ్ అయితే రాదు. ఈ విషయంలో డైరెక్టర్ కు కొంత వరకు మంచి మార్కులే పడ్డాయని చెప్పొచ్చు. ఇక కళ్యాణ్ రామ్ నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. మూడు విభిన్న పాత్రల్లో ఈ నందమూరి హీరో యాక్టింగ్ బాగుంది. ముఖ్యంగా మైఖేల్ పాత్రలో కళ్యాణ్ రామ్ హావభావాలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ ఆషికా రంగనాథ్ పరిధి మేరకు నటించింది. “ఎన్నో రాత్రలు వస్తాయి..” అనే సాంగ్ లో ఆషికా గ్లామర్ షో సినిమాకు ప్లస్. ఇక గిబ్రన్ మార్క్ మ్యూజిక్ ఈ సినిమాలో కనిపించలేదు. బీజీఎం సౌండ్ ఎక్కువ వచ్చినా, గుర్తుండిపోయేలా లేదు. సౌందర్ రాజన్ కెమెరా పనితనం మరింత మెరుగ్గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ :
మొత్తంగా..
సగం పాసైన కొత్త దర్శకుడు
