Box office: ఫస్ట్ డే కుమ్మేసిన “స్పై”… నిఖిల్ కెరీర్ బెస్ట్

నిఖిల్ హీరో గా నటించిన పాన్ ఇండియా చిత్రం “స్పై” జూన్ 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే టాక్ ఎలా ఉన్నా మొదటి రోజు “స్పై” భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. ఫస్ట్ డే అన్ని అంచనాలను మించి పోయిన ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ దక్కించుకుంది. ఇక ఏరియా వారిగా “స్పై” ఫస్ట్ డే కలెక్షన్లను గమనిస్తే..

నైజాం: 1.72 CR, సీడెడ్ : 56 L, ఉత్తరాంధ్ర: 54 L, ఈస్ట్ :33 L, వెస్ట్ : 22 L, నెల్లూరు: 18 L, కృష్ణ : 25 L, గుంటూరు : 48L రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 4కోట్ల 28లక్షల షేర్ కేసూలు చేయగా, 6.85 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఇక కర్ణాటక రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 46 లక్షలు, ఓవర్సీస్ లో 1.28కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక “స్పై” సినిమా వరల్డ్ వైడ్ గా 6.02 కోట్లకి పైగా షేర్ వసూలు చేయగా 10.45 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది.

- Advertisement -

అయితే బక్రీదు పండగ అడ్వాంటేజ్ తో విడుదల కావడం వల్ల భారీ ఓపెనింగ్స్ ఈ సినిమాకి దక్కాయని చెప్పవచ్చు. ఇక “స్పై” వరల్డ్ వైడ్ గా 18.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా ఫస్ట్ డే కలెక్షన్ల ని తీసేస్తే ఇంకా 12.48కోట్ల షేర్ ని రాబట్టాల్సి ఉంటుంది. వీకెండ్ మరో మూడు రోజులు ఉండడంతో ఈ సినిమా భారీ మొత్తం లో కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది మరి చూద్దాం ఏం జరుగుతుందో.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు