SPY: నిఖిల్ కంటే ఎక్కువగా “స్పై” ని నమ్ముతున్న హీరోయిన్

నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ “స్పై”. గూఢచారి సినిమా జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా  పలు కారణాలతో వాయిదా పడిందంటూ వార్తలు రాగా, చిత్ర యూనిట్ సమస్యలను పరిష్కరించుకుని  జూన్29 న విడుదల చేస్తున్నారు. ఇక “స్పై” ట్రైలర్ ను జూన్22 న సాయంత్రం AAA సినిమాస్ లో లాంచ్ చేయడం జరిగింది. “స్పై” ట్రైలర్ చూడ్డానికి చాలా గ్రిప్పింగ్ గా,స్టైలిష్ గాను ఉండటమే గాక నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఇక ఈ ట్రైలర్ లాంచ్ లో హీరో తో పాటు ఇతర నటీనటులు పాల్గొనగా అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా హీరోయిన్ ఐశ్వర్య మీనన్ నిలిచింది.

తెలుగులో మొదటి సినిమా చేస్తున్న ఈ భామ చెన్నైకి చెందినది. ట్రైలర్ లాంచ్ కి చాలా గ్లామర్ గా క్యూట్ గా రెడీ అయ్యి వచ్చింది. ఇక ట్రైలర్ లాంచ్ సందర్బంగా ఐశ్వర్య మాట్లాడుతూ ఇలా అంది. ఈ సినిమా “నా ఫస్ట్ తెలుగు సినిమా”. ఇక్కడ నా సహనటులతో నేను ఎలా ఉండగలనో అని కొంచెం భయపడ్డాను. కానీ తన తోటి నటీనటులు, టెక్నిషియన్స్ నాతో చాలా సరదాగా ఉన్నారు. నాకు ఈ సినిమాలో చాలా మంచి రోల్ దొరికింది. ఈ సినిమా పట్ల అందరికంటే నేనే హ్యాపీగా ఉన్నానంటూ తన సహనటులు సానియా, అభినవ్ గౌతమ్ లకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. “స్పై” సినిమా జూన్29 న విడుదల అవుతుంది. మా సినిమా చూసి బ్లాక్ బస్టర్ హిట్ చేయండి అని ఆడియన్స్ ని కోరింది.

ఇక ట్రైలర్ లాంచ్ లో ఫస్ట్ సినిమా అన్న కంగారులేకుండా హీరోకంటే బాగా మాట్లాడమే కాకుండా, హీరోకంటే ఎక్కువగా ఈ సినిమాపై నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే “స్పై” సినిమా విజయం అందరికంటే ఎక్కువ ఐశ్వర్య కే అవసరం. తమిళ్ లో సక్సెస్ కాలేకపోయిన ఈ హీరోయిన్ తెలుగులో హిట్టు కొట్టి ఇక్కడ నిలదొక్కుకోవాలని చూస్తుంది. మరి ఐశ్వర్య ఆశ నెరవేరుతుందో లేదో తెలియాలంటే జూన్29వరకు వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు