Box office: టాక్ అంత బ్యాడ్ కాదు.. అయినా ఇలా జరిగిందేంటి ?

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం కస్టడీ. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. మే 12న విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. అయితే తాజాగా కస్టడి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ డిటైల్స్ వచ్చాయి.

కస్టడీ మూవీకి ఏరియాల వారీగా వచ్చిన కలెక్షన్లను ఒక్కసారి గమనిస్తే.. నైజాం 76L, సీడెడ్ 23L, ఉత్తరాంధ్ర 22L, ఈస్ట్ 11L, వెస్ట్ 8L, గుంటూరు 20L, కృష్ణా 12L, నెల్లూరు 10L, ఓవరాల్ గా ఏపీ, తెలంగాణల్లో మొత్తం కలిపి 1.82 కోట్ల షేర్ రాబట్టగా, 3.35 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా కలుపుకొని మరో 8 లక్షలు వచ్చింది. ఓవర్సీస్ లో 60L రాగా, తమిళ కలెక్షన్స్ 12లక్షలు వసూలు చేసింది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కస్టడీ మూవీ మొదటి రోజు 2. 62 కోట్ల షేర్ ని 5.10 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. అయితే నాగచైతన్య గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ కస్టడీ సినిమాకు దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పొచ్చు. చై నటించిన లాస్ట్ మూవీ థ్యాంక్ యు తర్వాత మళ్ళీ అలాంటి ఓపెనింగ్స్ కస్టడీ కి వస్తాయని ఊహించలేదు. థ్యాంక్ యు తెలుగు రాష్టాల్లో ఫస్ట్ డే 1.65 కోట్లు వసూలు చేయగా కస్టడీ 1.82 కోట్లు రాబట్టింది. నాగ చైతన్య థ్యాంక్ యు కు ముందు నటించిన అయిదు సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల కి పైగా షేర్ సాధించాయి. దాన్ని బట్టి కస్టడీ కి ఎలాంటి ఓపెనింగ్స్ వచ్చాయో తెలుస్తుంది. 25 కోట్ల టార్గెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 22 కోట్లు రాబట్టాలి. మరి వీకెండ్ ముగిసేసరికి ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు