2018: ఇండస్ట్రీ హిట్ దిశగా వెళ్తున్న మలయాళ సెన్సేషన్!

కేరళలోని 2018 లో వచ్చిన వరదల నేపథ్యంలో వచ్చిన లేటెస్ట్ మూవీ “2018”. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాను జూడో ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. మలయాళ స్టార్ టువినో థామస్, కుంచకో బోబన్ హీరోలుగా నటించారు. ఇంకా అసిఫ్ అలీ, వినీత్, అపర్ణ బాలమురళి, తన్వి రామ్, లాల్, కళైసరన్, నరైన్, శివదా నాయర్, జనార్దన్, గౌతమి నాయర్ కీలక పాత్రల్లో నటించారు. కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్ లో వేణు కునపిళ్లే, ck పద్మ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.

మే 05 వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ని దక్కించుకుని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఏ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన “2018” మలయాళం లో బ్లాక్ బస్టర్ వసూళ్లను కొల్లగొడుతుంది. విడుదలైన మొదటి రోజు ఈ సినిమా కేవలం 1.85 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా రోజుకు మూడు కోట్లకు తగ్గకుండా వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు కేరళలో 50 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లోను సమాన కలెక్షన్లు అందుకుంది. ఓవర్సీస్ లో ఈ సినిమా దాదాపు 45 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇక తాజాగా “2018” చిత్రం వంద కోట్ల మార్క్ ని కూడా దాటేసింది అని చిత్ర యూనిట్ తెలిపారు. మలయాళం లో ఫాస్టెస్ట్ 100cr గ్రాసర్ గా ఈ సినిమా నిలిచింది. ఇక మలయాళం లో ఇప్పటి వరకు 100కోట్ల వసూలు చేసిన సినిమాలు రెండే. అవి మోహన్ లాల్ నటించిన పులిమురుగన్, లూసిఫర్. పులిమురుగన్ 150 కోట్ల గ్రాస్ వసూలు చేసి మలయాళం ఇండస్ట్రీ హిట్ గా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత లూసిఫర్ 127 కోట్లకు వసూయలు చేసి రెండో స్థానంలో ఉండగా, మూడో ప్లేస్ లో ఉన్న భీష్మ పర్వం(95 కోట్లు )ను బ్రేక్ చేసి ముందుకు వెళ్తుంది 2018 సినిమా. ఇక ఈ సినిమా పదకొండు రోజుల్లో 100కోట్లు వసూలు చేయగా మరో వరం రోజుల్లో అన్ని కలెక్షన్స్ ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు