Adipurush: బాయ్‌కాట్ ట్రెండ్‌ను దాటేసింది… ఇక తిరుగుండదా?

ఆదిపురుష్.. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకొచ్చినన్ని సమస్యలు ఇంకే పెద్ద సినిమాకు రాలేదన్నది వాస్తవం. ప్రభాస్ ఫస్ట్ లుక్ ట్రోలింగ్ మొదలుకొని మొన్నటి తిరుమల ఇష్యూ వరకు ఏదో ఒకరకంగా ఈ సినిమాకు పలు సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో బాయ్కాట్ ట్రెండ్ నడుస్తుందని తెలిసిందే. ముఖ్యంగా సుశాంత్ రాజ్ పుత్ సింగ్ మరణం తర్వాత ఈ
బాయ్కాట్ విషయంపై ఆడియన్స్ చాలా గట్టిగా ఉన్నారు. బాలీవుడ్ లో ఏ స్టార్ హీరో సినిమా వచ్చినా, ఎంత బాగున్నా ప్రేక్షకులు దారుణంగా తిప్పికొట్టారు. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా, సల్మాన్ ఖాన్ కిసి కా భాయ్ కిసి కా జాన్, ఇంకా రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర ఇలా పెద్ద పెద్ద సినిమాలపై బాయ్కాట్ ప్రభావం పడింది. మొన్నామధ్య వచ్చిన షారుఖ్ ఖాన్ నటించిన “పఠాన్” సినిమాపై కూడా విపరీతంగా బాయ్కాట్ ట్రెండ్ జరిగింది. ఏదో అదృష్టం బాగుండి స్క్రీన్ ప్లే వల్లో మరే కారణం వల్లో ఆ ఒక్క సినిమా గట్టెక్కింది.

ఇప్పుడు ఆదిపురుష్ సినిమాకు ఇదే జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్ హీరో అయినప్పటికీ సినిమా మొదలైనప్పటి నుండి పూర్తిగా బాలీవుడ్ సినిమా కావడంతో బాయ్కాట్ సెగ దీనిక్కూడా అంటుకుంది. అది ఈ సినిమా టీజర్ తో పీక్స్ కి చేరింది. అయితే వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ ఆ సినిమా పై చాలా జాగ్రత్త వహించింది. ట్రైలర్ కట్ ని డీసెంట్ గా జాగ్రత్తగా కట్ చేసి టీజర్ వల్ల వచ్చిన విమర్శలకు చెక్ పెట్టారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో చేయడం మొదలెట్టారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చినజీయర్ స్వామిని గెస్ట్ గా పిలవడం, థియేటర్లలో ఒక్క సీటును హనుమంతుడి కోసం విడిచి పెట్టాలని ప్రచారం చేయడమే కాకుండా ప్రముఖ రాజకీయ నాయకులతో ఆదిపురుష్ ను ప్రమోట్ చేస్తున్నారు.

అయితే అది కూడా ఈ సినిమా పై ఒకరకంగా ట్రోలింగ్ కావడానికి కారణం అని చెప్పొచ్చు. ఒకే రాజకీయ పార్టీ ఈ సినిమాను ప్రమోట్ చేస్తుండడం వల్ల అది ఆ పార్టీకి ప్లస్ అయినా ఈ సినిమాకు వేరే రాజకీయ వర్గం సపోర్ట్ లేకుండా చేస్తుందనేది గమనించాలి. ఇక తాజాగా ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత కూడా తిరుమలలో కృతి సనన్ ఓం రౌత్ ని హాగ్ చేసుకుని ముద్దు పెట్టడం లాంటివి, ఈ సినిమాపై దారుణమైన ట్రోల్ల్స్ రావడానికి కారణమయ్యాయి.

- Advertisement -

అయితే వీటన్నింటినీ ఎదుర్కొని ఈ సినిమా రామాయణ గాథ అనే పెద్ద సెంటిమెంట్ తో విపరీతమైన అంచనాలతో రిలీజ్ అవుతుంది. అయితే చిత్ర నిర్మాతలు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. సినిమా కంటెంట్ బాగుండి, అందులో డ్రామాకి, ఎమోషన్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అయితే చాలు. అందులో గ్రాఫిక్స్ లేకపోయినా, ఏ రాజకీయ నాయకుల సపోర్ట్ లేకపోయినా సినిమా ఆడుతుంది. అలా కాకుండా సినిమాలో ఏ మాత్రం రామాయణ కథనాన్ని మార్చి తీసినా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చి సినిమా దారుణమైన పరాజయం అందుకోవడమే కాకుండా సినిమా బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. మరి బాక్స్ ఆఫీస్ పై ఆదిపురుష్ వదిలే బాణం గురి తప్పకుండా రికార్డులను ఛేదిస్తుందా? అన్నది తెలియాలంటే జూన్ 16న సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు