Adipurush: సీతాశాపం… పాపం కృతికి అనుకున్నదే జరిగింది

మొత్తానికి ఊహించిందే జరిగింది. సీత పాత్ర చేయడం వల్ల కృతికి కష్టాలు తప్పవని Filmify చెప్పిందే నిజమైంది. సీత పాత్రలో నటించడం ఒక ఎత్తైతే, ఆ ఇమేజ్ ను క్యారీ చేయడం ఇంకో ఎత్తు. ఈ క్రమంలో ఏ చిన్న తప్పు జరిగిన భూతద్దంతో చూడటానికి మన నెటిజన్లు ఉండనే ఉన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఆదిపురుష్ లోని మన జానకికి (కృతి సనన్) వచ్చింది.

అసలు విషయానికి వస్తే ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా వస్తున్న “ఆదిపురుష్”లో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ తమ ప్రమోషన్లలో జోరు మీదుంది. ఇప్పటికే ట్రైలర్స్, పాటల విడుదలతో సినిమాపై ఉన్న హైప్ ని రెట్టింపు చేయగా, తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మరింత పాజిటివ్ వైబ్స్ ని తీసుకొచ్చింది. అయితే అటు చిత్ర యూనిట్ ఎలా అయితే తమ ప్రచారాలతో సినిమాపై హైప్ పెంచుతుందో, ఇటు హీరోయిన్ కృతి సనన్ తన పొరపాట్ల వల్ల కావచ్చు, లేదా అనుకోకుండా కావచ్చు సినిమాపై నెగిటివ్ ఇంప్రెషన్స్ రావడానికి కారణం అవుతుంది.

ఆదిపురుష్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనప్పటినుండి ఇందులో సీత పాత్ర చేసిన కృతి సనన్ పై ప్రేక్షకులు ఒక నటి అనే భావనతో కాకుండా సీతమ్మ తల్లిగా గౌరవం ఇచ్చారు. ఎందుకంటే ఆ పాత్రకి ఉండే ప్రాముఖ్యత అలాంటిది మరి. ఇలాంటి రోల్ చేయడమే గొప్ప అని చాలామంది అంటారు. మరి ఇంత పేరున్న పవిత్రమైన పాత్రని సినిమాలో చేసినపుడు ఆ పేరును నిలుపుకోవడం కూడా తెలియాలి.

- Advertisement -

అయితే గతంలో కృతి సనన్ ఆదిపురుష్ సినిమా చేస్తూనే సోషల్ మీడియాలో పలు బ్రాండ్స్ కి ఎక్స్ పోసింగ్ చేస్తూ పోజులివ్వడం, అలాగే ఫోటోషూట్లు చేయడం తెలిసిందే . దానిపై నెటిజన్స్ అప్పుడే వ్యతిరేకేత వ్యక్తం చేస్తూ సినిమా రిలీజ్ అయ్యేవరకైనా ఇలాంటి ఫోటో షూట్స్ చేయడం మానేయాలని, లేదంటే తన కెరీర్ అక్కడితో ఆగిపోతుందని అభిమానులతో సహా అందరూ కామెంట్స్ చేశారు. దీనికి కృతి సనన్ ఏమీ రియాక్ట్ అవ్వకపోగా రీసెంట్ గా తిరుమల ఆలయ ప్రాంగణంలో తన వ్యక్తిగత ప్రవర్తనతో తన పేరును మరింత తగ్గించుకోవడమే గాక, సినిమాపై వ్యతిరేకత రావడానికి కూడా కారణమయ్యింది.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ అనంతరం తిరుమలలో వేంకటేశ్వరుడిని దర్శించుకున్న చిత్ర యూనిట్, బయటికి వచ్చాక ఆలయ ప్రాంగణంలో కృతి సనన్ దర్శకుడు ఓం రౌత్ కి హగ్ ఇస్తూ ముద్దు పెట్టడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రేక్షకులు సోషల్ మీడియాలో తీవ్రంగా కృతి సనన్ కి చురకలంటిస్తున్నారు. అంతే కాక దానిపై చిలుకూరు బాలాజీ ప్రధానార్చకులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ఇష్యూ పై చిత్ర యూనిట్ స్పందించకపోయినా, జరిగిన డ్యామేజ్ ని మాత్రం రిపేర్ చేసే పనిలో ఉన్నారు.

అయితే బాలీవుడ్ సైడ్ నుంచి చూస్తే ఈ కల్చర్ ముందు నుండి అక్కడ ఉంది. కాబట్టి అక్కడి జనాలు అంతగా పట్టించుకోరు. కానీ ఆదిపురుష్ సినిమా విషయంలో మాత్రం సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి. ఎందుకంటే బాలీవుడ్ లో ఇలాంటివి ఎంత కామన్ అయినా, రామాయణ ఇతిహాసం ఆధారంగా చేస్తున్న ఆదిపురుష్ లాంటి సినిమా చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు? ఎక్కడ? ఎలా ప్రవర్తించాలి? అన్న కనీస అవగాహన తెలిసి ఉండాలి. ఈ మాత్రం విజ్ఞత లేకుండా ప్రవర్తించడం మాత్రం తప్పు. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు గాని సినిమాపై ఈ ఎఫెక్ట్ గట్టిగానే పడనుంది.

ఏది ఏమైనా, సీత పాత్ర చేస్తున్న కారణంగా, కృతి ఇలాంటి ట్రోల్స్ భవిష్యత్తులో మరిన్ని ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు