NBK108: బాలయ్యతో బాహుబలి భామ ?

అఖండ, వీరసింహారెడ్డి వంటి చిత్రాలతో వరుస సూపర్ హిట్స్ అందుకున్న నందమూరి బాలకృష్ణ అదే జోష్ లో తన 108 వ చిత్రాన్ని మొదలుపెట్టారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పలు ఆసక్తికర అప్డేట్స్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోగా ఎంపికైందని సమాచారం అందుతుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చిత్రం బృందం నుంచి రానుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ లో కాజల్ పాల్గొంటుందని తెలుస్తోంది.

ఆచార్య తర్వాత కాజల్ నటిస్తున్న తెలుగు సినిమా ఇదే. ఆచార్యలో నుంచి కూడా ఈ భామ మధ్యలోనే వెళ్లిపోయింది. అంటే తెలుగులో కాజల్ చివరి సినిమా మోసగాళ్లు. ఇది ఇలా ఉండగా NBK108లో ఓ కీలక పాత్రలో హిందీ నటి నోరా పతేహీని తీసుకోవాలని చూస్తున్నారట. ఈ భామ ఈ సినిమాలో నెగిటివ్ పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది.

- Advertisement -

అంతేకాదు ఈ చిత్రంలో బాలయ్య – నోరా ఫతేహి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ సినిమాకు హైలైట్ గా ఉంటాయని అంటున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ గతంలో బాహుబలి సినిమాలో “మనోహరీ” అనే పాటలో తన అందచందాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నట్లు డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటికే తెలిపారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు