Prabhas: సలార్ ఓటీటీ రైట్స్ కి కళ్ళు చెదిరే ఆఫర్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమా నిరాశ పరిచటంతో  ప్రభాస్ అభిమానులు సలార్ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇది ఫుల్ లెంత్ యాక్షన్ మూవీ కావటంతో ప్రభాస్ లైనప్ లో ఉన్న సినిమాలకంటే కంటే కూడా ఈ సినిమా మీదనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలు పెంచిన నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న మరో వార్త సినిమాపై నెలకొన్న అంచనాలను తారాస్థాయికి చేసారుస్తోంది.

వివరాల్లోకి వెళితే, ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సౌత్ తో పాటు ఇతర భాషల్లో ఓటీటీ రైట్స్ కైవసం చేసుకునేందుకు 200కోట్ల భారీ రేట్ ని ఆఫర్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇదే గనక నిజమైతే ఇంత భారీ రేట్ పలికిన సినిమాగా సలార్ మరో రికార్డ్ సృష్టించే అవకాశం ఉంది. ఇప్పటికే వ్యూస్ పరంగా టీజర్ రికార్డులు బద్దలు కొట్టడంతో ఆనందంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి తాజాగా వినిపిస్తున్న న్యూస్ మరింత ఉత్సాహం నింపుతోంది.

ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు సినిమా యూనిట్ అనౌన్స్ చేసింది. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస డిజాస్టర్స్ అందుకున్న ప్రభాస్ కి సలార్ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. మరి, రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ సినిమా ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ అందిస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు