BRO: పవన్ కళ్యాణ్ కి హ్యాండిచ్చిన రకుల్ ప్రీత్..!

తమిళ స్టార్ నటుడు సముద్రఖని దర్శకత్వంలో మామ,అల్లుళ్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం “బ్రో”. తమిళంలో ఘన విజయం సాధించిన వినోదాయ సీతాం చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై మెగా అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి ధరంతేజ్ కి జోడిగా అందాల భామ ప్రియా వారియర్ కనిపించనుంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, రోహిణి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

ఫిబ్రవరిలో మొదలైన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 75% పూర్తి చేసుకుంది. సోమవారం నుండి హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలోని మరో రెండు పాటల చిత్రీకరణ కూడా పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి స్పెషల్ సాంగ్ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్పెషల్ సాంగ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని సంప్రదించగా.. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

అయితే సోమవారం నుండి మొదలు కావలసిన ఈ సాంగ్ షూటింగ్ కోసం రకుల్ కి కాల్ చేయడంతో మూవీ యూనిట్ కి షాక్ ఇచ్చిందట ఈ ముద్దుగుమ్మ. డేట్స్ కుదరడం లేదంటూ ఐటెం సాంగ్ చేయనని చెప్పిందట. దీంతో ఇప్పటికిప్పుడు ఏం చేయాలని మూవీ యూనిట్ తర్జనభర్జనలు పడుతున్నారట. ఓవైపు వారాహితో ప్రజలలోకి వెళ్లాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ ని ఒప్పించి మళ్లీ డేట్ అడగడమా..? లేక మరో బ్యూటీ ని సాంగ్ కోసం ఫిక్స్ చేయడమా అనే డిస్కషన్ లో ఉన్నారట మేకర్స్. ఇక ఈ చిత్రాన్ని జూలై 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది మూవీ యూనిట్.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు