Pushpa 2: రష్మిక పాత్ర తక్కువే..

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఎదైనా ఉందా అంటే.. అది పుష్ప పార్ట్ 2 అని చెప్పొచ్చు. గతేడాది డిసెంబర్ లో వచ్చిన పుష్ప ది రైజ్.. ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలుసు. 200 నుంచి 250 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 377 కోట్ల కలెక్షన్లు చేసి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు, డ్యాన్స్ స్టెప్స్, డైలాగ్స్ ప్రపంచాన్నే ఊపేశాయి. ఇప్పటికీ కూడా ఈ సినిమాలోని తగ్గేదలా.. వంటి డైలాగ్స్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

ఇలాంటి భారీ సినిమాకు సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ ప్రారంభంలోనే ప్రకటించాడు. ఇప్పటి వరకు స్టోరీ, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న పుష్ప 2.. ఇటీవలే రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించింది. మొదటి షెడ్యూల్ విశాఖపట్నంలో జరిగింది. ఈ షెడ్యూల్ లో కేవలం అల్లు అర్జున్ పైనే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దీనిలో హీరోయిన్ రష్మిక మందన్నా పాల్గొనలేదు. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుంది. దీనిలో రష్మిక మందన్నా – అల్లు అర్జున్ మధ్య కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల కోసం రష్మిక దాదాపు 10 నుంచి 15 రోజుల సమయాన్ని కేటాయించినట్టు సమాచారం.

అయితే గత కొన్ని రోజుల నుంచి పుష్ప 2లో రష్మిక పాత్ర తక్కువగా ఉంటుంది అనే ప్రచారం సాగుతుంది. నిజానికి పుష్ప మొదటి పార్ట్ లో రష్మిక పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నిడివి కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ, సెకండ్ పార్ట్ లో ఫోకస్ మొత్తం అల్లు అర్జున్ పైనే ఉండబోతుందని తెలుస్తోంది. అందుకే రష్మిక పాత్ర నిడివి తగ్గే అవకాశం ఉందని సమాచారం.

- Advertisement -

పుష్ప ది రూల్ కోసం రష్మిక నుంచి డైరెక్టర్ సుకుమార్ కేవలం 50 నుంచి 55 రోజుల సమయాన్ని మాత్రమే తీసుకున్నాడట. ఈ డేట్స్ లోనే రష్మిక మందన్నా పాత్ర షూటింగ్ ను పూర్తి చేస్తాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ఈ సినిమా కోసం దాదాపు ఏడాది పాటు డేట్స్ ఇచ్చాడట. దీంతో పుష్ప2 లో రష్మిక పాత్ర చాలా తక్కువగా ఉంటుందని అర్థమవుతుంది.

మరి ఇది నిజమో కాదో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు