Samantha: అక్కినేని వారికి గట్టిగానే పోటీ ఇస్తుంది…

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత పేరు ముందు వరుసలో ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన సామ్ కు స్టార్ హీరోయిన్ అనే ట్యాగ్ సంపాదించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. కానీ, సామ్ కెరీర్ ఎక్కువ రోజులు ఉండదని అప్పట్లో అనే వారు. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత సామ్ ఇండస్ట్రీకి దూరమవుతుంది అంటూ వార్తలు వచ్చాయి. విడాకుల తర్వాత సామ్ పని అయిపోయిందని, ఛాన్స్ లు రావాని ప్రచారం చేశారు.

సామ్‌కి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఇండస్ట్రీలో నిలదొక్కుకుని నిలిచింది. ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, భారీ విజయాలను సాధిస్తుంది. నాగ చైతన్య తర్వాత సామ్ “కాతువాకుల రెండు కాదల్” “యశోద” రెండు సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు కూడా సమంతకు భారీ విజయాన్ని అందించాయి. ప్రస్తుతం శాకుంతలం అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తోంది. వీటిపై విడుదలకు ముందు నుంచే విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంది.

అలాగే బాలీవుడ్ లో సిటాడెల్ అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం కాబట్టి, ఆ వెబ్ సిరీస్ ఎంతటి విజయం సాధిస్తుందో ముందే చెప్పొచ్చు. ఇలా విడాకుల తర్వాత కేవలం భారీ ప్రాజెక్ట్ లే తీస్తూ పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగింది.

- Advertisement -

ఇది ఇలా ఉండగా, వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉన్న సామ్ మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు హీరోయిన్ ప్రాధాన్యత గల స్టోరీని సామ్ కి వినిపించారట. స్టోరీ నచ్చడంతో సామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా పూర్తి అయిందని టాక్. ఈ సినిమాను కూడా ఒక భారీ ప్రాజెక్ట్ ల తెరకెక్కించి, పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని చూస్తున్నారట. ఇది నిజమైతే, సామ్ క్రేజ్ మరింత పెరుగుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు