Samantha: వరుస షూటింగ్‌లతో బిజీ బిజీ

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత సమంత వరుసగా చిత్రీకరణలతో బిజీ బిజీగా గడుపుతుంది. అలాగే ప్రతి రోజు జిమ్ కి వెళ్లి తన ఫిట్ నెస్ మరింత పెంచుకుంటుంది. జిమ్ కి వెళ్లిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. తన ఆరోగ్యంపై క్లారిటీ ఇస్తోంది. అయితే సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటుంది.

ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన ప్రముఖ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే ఈ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సమంత పాత్ర కూడా పలు యాక్షన్ సీన్స్ లో ఉంటుందని సమాచారం. అందుకే సమంత తన ఫిట్ నెస్ ఫోకస్ పెట్టింది.

సిటాడెల్ షూటింగ్ పూర్తి కాక ముందే, ఖుషి సినిమా షూటింగ్ పాల్గొనేందకు సమంత సిద్ధమవుతుందని తెలుస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దీనిలో సమంత హీరోయిన్ పాత్ర చేస్తోంది. కశ్మీర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా పూర్తిగా ప్రేమకథతో రానుందని తెలుస్తోంది. దీనిలో విజయ్ దేవరకొండ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే సమంత కాశ్మీరీ యువతి పాత్ర చేస్తోంది.

- Advertisement -

అయితే ఇటీవల.. తన వల్లే ఖుషి సినిమా షూటింగ్ వాయిదా పడిందని, అందుకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తనను క్షమించాలని కోరింది. అయినా, ఖుషి సినిమా సెట్స్ లోకి సమంత ఎప్పుడు వస్తుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఖుషి రెగ్యూలర్ షూటింగ్ ఈ నెల 27న స్టార్ట్ కానుందని తెలుస్తోంది. మార్చి 8వ తేదీ నుంచి ఖుషి సెట్స్ లో సమంత అడుగుపెట్టనుందని టాక్. అప్పటి నుంచి దాదాపు నెల రోజుల పాటు హైదరాబాద్ లోనే ఆ షెడ్యూల్ షూటింగ్ ఉంటుందట. అందుకు అవసరం అయ్యే సెట్ వర్క్ కూడా స్టార్ట్ అయిందట. దీని తర్వాత కొత్త షెడ్యూల్ ను ఏప్రిల్ నెలలో అలెప్పిలో జరగనుందని టాలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు