Samantha: యంగ్ హీరోతో మందేస్తూ – ఆన్ ఎంజాయ్ మూడ్..!

లేడీ సూపర్ స్టార్ సమంత, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1న రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమాలోని లిరికల్ సాంగ్ ఇటీవలే విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచింది. రీసెంట్ గా శాకుంతలం సినిమా ద్వారా డిజాస్టర్ చవిచూసిన సమంతకి, గతేడాది లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ కి ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూట్ గ్యాప్ లో సమంత, విజయ్ రెస్టారెంట్ లో కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విజయ్ తో కలిసి దిగిన ఫోటోతో సమంత షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.’ మీ మంచిని చూస్తారు, మీ బాధని చూస్తారు, మీ సక్సెస్ ని, ఫెయిల్యూర్ ని చూస్తారు, మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడూ మనతోనే ఉంటారు’ అంటూ సమంత విజయ్ ని ట్యాగ్ చేసిన పోస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. రెస్టారెంట్లో లంచ్ చేస్తున్న విజయ్, సమంత ఫోటోకి క్యూట్ గా ఫోజ్ ఇచ్చారు. ఆ మధ్య విజయ్ రష్మిక ల రిలేషన్ బ్రేకప్ కి దారి తీయడానికి కారణం సమంత విజయ్ ల మధ్య ఉన్న ప్రేమాయణం అని రూమర్లు సోషల్ మీడియాలో గట్టిగా వినిపించాయి, ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారటంతో ఆ రూమర్ల నిజం ఉందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

గత కొంత కాలంగా, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, ఇటు సోషల్ మీడియాలో డైవర్స్ విషయంపై తరచూ విమర్శలు ఎదుర్కొంటున్న సమంత అన్నిటిని మర్చిపోయి హ్యాపీ గడుపుతుండటం పట్ల సమంత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాత్రం సమంత చేసిన పోస్ట్ ని ఉద్దేశిస్తూ, విజయ్ సమంతల మధ్య ఫ్రెండ్షిప్ ప్రేమకి దారి తీస్తోందా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అటు సోషల్ మీడియాలో, ఇటు అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతున్న ఈ ఫోటోపై సమంత, విజయ్ లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు