BRO: PKని ఏం చేయలేక తన సినిమాపై జులుం ప్రదర్శిస్తున్న ప్రభుత్వం?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన వారాహియాత్రలో బిజీ గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలకు గ్యాప్ ఇచ్చి, పూర్తిగా జనేసేన పైనే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే అందులో “బ్రో” సినిమా షూటింగ్ మాత్రం పూర్తిగా కంప్లీట్ అవడం మెగా అభిమానులకు సంతోషాన్నిస్తుంది. బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సముద్రఖని దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు రాసాడు.

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని బ్రో సినిమా జులై 28న విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే ఈ సినిమాకి ఇప్పుడు రిలీజ్ అడ్డంకులు ఎదురవుతున్నాయి. పవన్ కళ్యాణే ఏకైక బలంగా ఈ సినిమా విడుదల అవుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్రలో పలువురు రాజకీయ మంత్రులపై కామెంట్లు చేయగా, ఆ వివాదం ఇప్పుడు బ్రో సినిమాని చుట్టుకుంది.

అయితే పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఏమి చేయలేక ప్రముఖ రాజకీయ పార్టీ ప్రభుత్వ అధికారులు, పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాను రిలీజ్ కాకుండా అడ్డుకునే యత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హైర్స్, MG లు,SG లు లాంటివి కట్టిన బయ్యర్లు ఇప్పుడు, తాము కట్టిన అడ్వాన్సు ని వెనక్కి తీసుకుంటున్నారని టాక్. సీడెడ్, ఆంధ్ర ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లను అక్కడి రాజకీయ నాయకులు బెదిరిస్తున్నారని కూడా చర్చ జరుగుతుంది. ఇలాంటి సమస్యే గతంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు కూడా జరిగింది. కొన్ని థియేటర్లలో భీమ్లా నాయక్ సినిమాని 10రూపాయలకే అమ్మాలని MRO లు వచ్చి రూల్ పెట్టడం సంచలనం సృష్టించింది.

- Advertisement -

ఇప్పుడు బ్రో సినిమాను కూడా అదే విధంగా అడ్డుకోవాలని చూస్తున్నారు. అయితే మెగాభిమానులు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. రిలీజ్ టైమ్ వచ్చేనాటికి తమ ప్లానింగ్ లో తాము ఉంటామని అంటున్నారు అభిమానులు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు