BRO: ఈ స్పెషల్ సాంగ్ మామతోనా? అల్లుడితోనా?

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా తెలుగులో స్పెషల్ సాంగ్ ల ద్వారానే దూసుకుపోతుంది. బాలీవుడ్ లో హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన నటి తెలుగులో ఐటెం సాంగ్ ల ద్వారానే దూసుకుపోతుంది. ఇక తెలుగులో వాల్తేరు వీరయ్య లో స్పెషల్ సాంగ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ లోను ఐటెం సాంగ్ చేసింది. ఇక ఇప్ప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న “బ్రో” సినిమాలోనూ ఒక స్పెషల్ సాంగ్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.

ఇందులో నిజమెంతో తెలియదు గాని ఊర్వశి చేసేది స్పెషల్ సాంగా? లేదా మామూలు ఐటెం సాంగా అన్నది తెలీదు. మరి సినిమాలో ఇద్దరు హీరోలున్నపుడు ఆ పాట ఎవరితో చిత్రీకరిస్తారు. పవన్ కళ్యాణ్ తోనా? లేక సాయిధరమ్ తేజ్ తోనా? లేదంటే ఇద్దరితోను తీస్తారా అన్న కంఫ్యూషన్ వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇందులో దేవుడి పాత్ర చేస్తున్నాడు కాబట్టి, ఐటెం సాంగ్ లాంటివి చేయడం కుదరదు. అలా చేస్తే సాయి ధరమ్ తేజ్ తోనే ఆ సాంగ్ ఉండాలి. లేదా గోపాల గోపాల సినిమాలోలాగ ఒక ప్రత్యేకమైన స్పెషల్ సాంగ్ ని ఇద్దరు హీరోలతో కలిపి డిజైన్ చేస్తారేమో చూడాలి.

ఏది ఏమైనా “బ్రో” సినిమాలో ఎక్స్ పోసింగ్ లకు తావివ్వకుండా ఈ పాటను కొంచెం డిఫరెంట్ గా తీస్తే బాగుంటుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అయినా ఈ సినిమా కి త్రివిక్రమ్ కూడా పని చేస్తుండడం వల్ల అలంటి మిస్టేక్స్ ఏమి జరగకుండా జాగ్రత్త పడతాడని అభిమానులు అంటున్నారు. ఇక బ్రో సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల విశ్వప్రసాద్ లు నిర్మించగా, సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే 90 శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై 28న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు