New Movie: టీచర్ గా మారనున్న ఊర్వశి

ఊర్వశి రౌటేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లో సనమ్ రే, పాగాల్ పంతి, హేట్ స్టోరీ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశి తెలుగులో వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా ఇక్కడ కూడా ఫేమస్ అయ్యింది. ఈ మధ్యనే ఏజెంట్ మూవీలో కూడా ఐటెం సాంగ్ చేసిన ఊర్వశి, ఆ సాంగ్ చేయడంపై లేనిపోని పుకార్లు లేపిన బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు పై ఫైర్ అయ్యిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ఏకంగా అతడిపై పరువునష్టం దావా కేసు కూడా వేసిందని వార్తలు వచ్చాయి.

ఇక లేటెస్ట్ గా ఊర్వశి రౌటేలా ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నానంటూ తన ఇన్స్టా గ్రామ్ పేజీలో స్టేటస్ పెట్టింది. అయితే ఆ చిత్రంలో ఎలాంటి రోల్ ను పోషిస్తుందో కూడా హింట్ ఇచ్చేసింది. ఊర్వశి పెట్టిన స్టేటస్ లో ఆమె చీరకట్టులో ఉండి ఒక బుక్ మరో చేత్తో ఒక పెన్ పట్టుకుని ఉంది. కళ్ళకి గ్లాసెస్ కూడా పెట్టుకుంది. దీన్ని బట్టి తన తదుపరి ప్రాజెక్ట్ లో ఒక టీచర్ రోల్ ని పోషిస్తుంది అని చెప్పకనే చెప్పింది. ఇక ఆ టీచర్ పాత్ర స్కూల్ కి సంబంధించిందా, లేదా కాలేజీ కి సంబంధించిందా అనేది తెలీదు.

అయితే ఊర్వశి రౌటేలా ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో బోయపాటిరాపో మూవీ, ఇంకా బ్లాక్ రోజ్ అనే మూవీలో నటిస్తుండగా, హిందీలో “దిల్ హాయ్ గ్రే” అనే సినిమాలో నటిస్తుంది. అయితే తను పెట్టిన స్టిల్ ఈ మూవీస్ లో ఏదైవుంటుందో చెప్పలేదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు