Allu Arjun: 20 ఏళ్ళ సినీప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఐకాన్ స్టార్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం ఇది పేరు కాదు ఇదొక బ్రాండ్ అని చెప్పాలి.అందరికి అభిమానులు ఉంటే అల్లు అర్జున్ కి ఆర్మీ ఉంది. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు సాధించుకున్నాడు.మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైపోయాడు. గంగోత్రి సినిమాతో హిట్ అందుకున్న అల్లు అర్జున్ తన రెండవ సినిమా “ఆర్య” తో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య సినిమా అల్లు అర్జున్ కెరియర్ గ్రాఫ్ ను అమాంతం పెంచేసింది. తెలుగు సినిమాలలో అప్పటివరకు ఎవరు చెప్పని రీతిలో ఒక ప్రేమ కథను చెప్పాడు సుకుమార్.
ఇప్పటికే కాదు అది ఎప్పటికి అల్లు అర్జున్ కెరియర్ లో ఒక క్లాసిక్. ప్రేమ కథను ఇలా కూడా చెప్పొచ్చు,ఇంత అందంగా ఒక కావ్యం లా
చూపించొచ్చు అని వెండితెరపై గీసిన అద్భుతమైన చిత్రమే ఆర్య.

ఆర్య సినిమా తరువాత వివి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన “బన్నీ” మంచి కమర్షియల్ హిట్ ను అందుకుంది. ఆ తరువాత చేసిన “హ్యాపీ” సినిమా కూడా ప్రేక్షకులకు హ్యాపీ అనిపించింది. ఆ తరువాత డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన “దేశముదురు” సినిమా అల్లు అర్జున్ లోని మరో అవతారాన్ని బయటకు తీసింది.

- Advertisement -

ఆ తరువాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన “పరుగు” సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కి పరుగులు పెట్టించింది. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా వేదం, రుద్రమదేవి వంటి సినిమాలలో కూడా కీలకపాత్రలను పోషించాడు అల్లు అర్జున్. వేదం సినిమాలోని కేబుల్ రాజు పాత్రలో ఎప్పటికి మర్చిపోలేని పెరఫార్మన్స్ ను ఇచ్చాడు అల్లు అర్జున్. జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసుగుర్రం లాంటి వరుస హిట్ సినిమాలు కొట్టి ఇండస్ట్రీకి “సరైనోడు” అనిపించుకున్నాడు.

త్రివిక్రమ్, సుకుమార్, పూరి జగన్నాధ్ వంటి స్టార్ దర్శకులతో రిపీట్ హిట్స్ ను అందుకుని తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు అల్లు అర్జున్. కేవలం తెలుగు సినిమాలకి పరిమితం కాకుండా “పుష్ప” సినిమాతో తన కీర్తి ఖండాలు దాటింది. నేడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా గురించి ప్రపంచం అంతా ఎదురుచూస్తుంది. నేటికీ 20 ఏళ్ళు పూర్తిచేసుకున్న అల్లు అర్జున్ సినీ ప్రస్థానంలో కొన్ని సినిమాలు నిరాశపరిచిన, అల్లు అర్జున్ మాత్రం ఎప్పటికి నిరాశ పరచలేదు. ఇంకా మరిన్ని విజయవంతమైన సినిమాలును చేసి అభిమానులను అలరించాలని ఆశిద్దాం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు