Agent: ఈ చెత్త కథకు రెండు కోట్లా అంటున్న విశ్లేషకులు ?

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఏజెంట్. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 28 న విడుదలైన ఈ సినిమా తోలి షో నుంచే ప్లాప్ టాక్ ని మూట గట్టుకుంది. 60 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ సినిమా ను నిర్మించగా సురేందర్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. అయితే మూవీ చూసిన ప్రేక్షకులు డైరెక్టర్ సురేందర్ రెడ్డి పై చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన సినిమాలా లేదని ఎదో నాసిరకం హిందీ మూవీ కథలా ఉందని అంటున్నారు.

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఏజెంట్ కథ కోసం మేకర్స్ ఏకంగా 2 కోట్లు ఖర్చుపెట్టారట. ఈ కథ రాసింది ప్రముఖ రచయిత వక్కంతం వంశీ. సాధారణంగా వక్కంతం వంశీ కథలు చాలా బాగుంటాయి. కిక్, ఎవడు, రేస్ గుర్రం, టెంపర్ లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ కి ఈయన కథనందించాడు. అంతే కాదు వక్కంతం వంశీ రాసిన ఊసరవెల్లి, “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమాలు ప్లాప్ అయినా స్టోరీ లైన్స్ మాత్రం చాలా బాగుంటాయి. అందుకే ఈ సినిమా పై పబ్లిక్ భారీ అంచనాలు పెట్టుకుని తీవ్రంగా నిరాశ చెందారు.

కొంతమంది సినీ విశ్లేషకులు ఏజెంట్ చూసి ఈ మాత్రం దానికి వక్కంతం వంశీ రెండు కోట్లు తీసుకున్నాడా? అని అంటున్నారు. డైరెక్టర్ గా ఎలాగూ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు రైటర్ గా కూడా ఫెయిల్ అయ్యాడన్నారు. ఏజెంట్ సినిమా చుసిన ఫ్యాన్స్ అయితే గూఢచారి, పఠాన్, సర్దార్ లాంటి మూవీస్ కలిపి కిచిడి చేసినట్టు ఉందని ఇంత చెత్తగా కథ ఎలా రాయగలిగారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్ లో కిక్, రేసుగుర్రం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. అలాంటిది వీరు ఇలాంటి చెత్త కథ తో వస్తారని ఊహించలేదని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా వల్ల అందరికంటే ఎక్కువ నష్టం అఖిల్ కి జరిగిందని చెప్పవచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు