Agent: పాపం సాక్షీ వైద్య… ఏజెంట్ ఫ్లాప్‌తో కెరీర్ ప్రశ్నార్థకం !

అక్కినేని వారసుడు అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ చిత్రం తొలి రోజు నుంచే మిశ్రమ స్పందన అందుకుంటుంది. రోటీన్ స్పై స్టోరీ అంటూ రివ్యూలు కూడా వచ్చాయి. దీంతో ఈ వీకెండ్ లో ఈ చిత్రానికి పెద్దగా వసూళ్లు వచ్చే ఛాన్స్ లేదు. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం డిజాస్టార్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. కాగా ఈ చిత్రం 37 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది. అంటే ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే 38 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఇప్పుడున్న టాక్ ను బట్టి చూస్తే అది కష్టమే అని చెప్పొచ్చు.

ఇది అక్కినేని అఖిల్ కెరీర్ కే కాదు.. ఈ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన యంగ్ బ్యూటీ సాక్షీ వైద్య కెరీర్ కు పెద్ద మైనస్. మహారాష్ట్రలోని పూణెలో జన్మించిన సాక్షీ వైద్య.. మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకుంది. లాక్ డౌన్ సమయంలో ఇన్ స్టాలో వీడియో పెట్టడంతో పాపులర్ అయింది. ఈ క్రమంలోనే ఏజెంట్ చిత్రంలో ఛాన్స్ వచ్చింది. మొదటి సినిమానే భారీ సినిమా, అందరూ మెచ్చే స్పై జానర్ సినిమా కాబట్టి హిట్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంది. ఏజెంట్ హిట్ అయితే, టాలీవుడ్ లో తిరుగుండదు అని ఆశ పడింది.

కానీ, ఎవరూ ఊహించని విధంగా ఏజెంట్ కు నెగిటివ్ టాక్ రావడం, సాక్షీ వైద్యకు పెద్ద మైనస్ అయింది. ఒక వేళ ఏజెంట్ హిట్ అయితే, అఖిల్ కంటే సాక్షీ వైద్యకే ఎక్కువ ప్లస్ అయ్యేది. మొదటి సినిమానే సక్సెస్ అయింది అంటూ ఈమెను గోల్డెన్ లెగ్ గా భావించే వారు. కానీ, ఇప్పుడు గోల్డెన్ లెగ్ అనే ట్యాగ్ రాకపోగా, ఐరెన్ లెగ్ అనే భావన వచ్చే ఛాన్స్ ఉంది.

- Advertisement -

అయితే ఈ బ్యూటీ.. ఏజెంట్ విడుదలకు ముందే మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గాంఢీవ దారి అర్జున సినిమాలో అవకాశం దక్కించుకుంది. దీంతో సాక్షీ వైద్యకు రెండో ఛాన్స్ దక్కింది అని చెప్పొచ్చు. ఏజెంట్ మైనస్ అయినా, గాంఢీవ దారి అర్జున హిట్ అయితే, టాలీవుడ్ లో ఈమె కెరీర్ బిల్డ్ అవ్వొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు