Nikhil: “స్పై” నుండి విడుదలైన “ఆజాది” పాటకి అర్థం తెలుసా?

“స్పై” చిత్ర యూనిట్ తమ ప్రమోషన్ల జోరును పెంచేస్తుంది. రోజుకు ఒక కొత్త అప్డేట్ ను ఇస్తూ ఉన్న తక్కువ సమయాన్ని బాగానే వాడుకుంటుంది. గూఢచారి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో దేశభక్తి గురించి కూడా బాగానే చూపిస్తున్నట్టు ట్రైలర్ లో తెలుస్తుంది. అయితే ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన ఒక పాట మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. సామాన్యుడిలో దేశభక్తిని రగిలిస్తూ ఉండే ఆ పాట సుభాష్ చంద్రబోస్ మాటల్ని గుర్తు చేస్తూ సాగుతుంది.

“ఆజాది” అన్న పేరుతో స్పై చిత్ర యూనిట్ యూట్యూబ్ లో ఈ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగింది. “ఆజాద్ హింద్ ఫౌజ్” అంటూ ఈ పాటను సింగర్ కాల భైరవ పాడడం జరిగింది. పాటని ట్రెండ్ కి తగ్గట్టు తీయడంలో మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఈ పాటలో సుభాష్ చంద్రబోస్ అన్న మాటని వాడుతూ లిరిక్స్ ఉంటుంది. అదే “తుమ్ ముఝే ఖూన్ దో”, “మై తుఝే ఆజాది దూన్గా” అంటే “నీ రక్తాన్ని అర్పిస్తే నేను నీకు స్వాతంత్య్రాన్ని ఇస్తానని అర్థం”.

ఇలాంటి వాక్యాలన్నీ కలిపి రైటర్ కృష్ణ చైతన్య మంచి పాటను రాసాడు. ఈ పాట థియేటర్లో వింటుంటే గూస్ బంప్స్ రావడం గ్యారంటీ. ఈ సినిమాకి ఆజాది పాట ప్లస్ అవుతుంది. ఇక ఈ పాట ద్వారా సుభాష్ చంద్ర బోస్ కి మంచి ట్రిబ్యూట్ ఇచ్చినట్టు కూడా ఉంది. సినిమాలో సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన ఏదో గట్టి విషయమే చెప్తున్నారని ఈ పాట వింటుంటే అర్ధమవుతుంది. మరి “స్పై” రిలీజ్ అయ్యే లోపు ఈ చిత్ర యూనిట్ నుండి ఇంకెన్ని అప్డేట్ లు వస్తాయో, సినిమాపై ఎంత హైప్ పెంచుతారో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు