Mrunal takur :సీత రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

“సీతా రామం” సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. చూడటానికి పదహారణాల తెలుగు అమ్మాయిల కనిపించే ఈ ముంబై బ్యూటీ తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చింది. సీత పాత్రలో మృణాల్ నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సాధారణంగా తెలుగు ప్రేక్షకులు ఎవరినైనా అభిమానిస్తే, ఆరాధించడం చేస్తారు. మృణాల్ లో విషయంలో కూడా ఇదే జరిగింది. సీత పాత్రలో ఆమె చీర కట్టు, బొట్టుతో నిండుగా కనిపించటంతో ఆమె నిజ జీవితంలో కూడా సీతగానే  ఉంటుందేమో అనుకున్నారు. అయితే రీసెంట్ గా మృణాల్ బీచ్ లో మోడ్రన్ డ్రెస్ లో దిగిన ఫోటోలు పోస్ట్ చేయడంతో అవి చూసిన సీత అభిమానులు “అయ్యో సీత ఏంటి ఇది” అంటూ మిమ్స్ తో హల్చల్ చేసారు.

అయితే ఇంత అభిమానం ఒక్క సినిమాతోనే రావడంతో మృణాల్ ఒక్కసారిగా ఆమె రెమ్యూనరేషన్ పెంచేసింది. సీతారామం సినిమాకి 2 కోట్లు తీసుకున్న ఈ సీత ఇప్పుడు తీసుకునే రెమ్యూనరేషన్ చూస్తే షాక్ అవ్వక తప్పదు. మృణాల్ ప్రస్తుతం తెలుగులో నాని30 సినిమా చేస్తుంది. ఈ సినిమా మినహా మృణాల్ చేతిలో ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ తెలుగు సినిమా ఏది లేదు. సీతారామం లాంటి సినిమా సూపర్ హిట్ అయ్యి చెప్పుకోదగ్గ పేరు వచ్చినా, చేతిలో సినిమాలు ఎందుకు లేవు అనుకుంటున్నారా అయితే మృణాల్ తన రెమ్యూరేషన్ ఆమాంతం పెంచడం వల్లనే ప్రొడ్యూసర్ లకి , హీరోలకి మృణాల్ ని తీసుకోవాలని ఉన్నకూడా ఆమె చెప్పే రెమ్యూనరేషన్ వల్ల వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారంట.

సీతారామం సినిమాకి 2 కోట్లు తీసుకున్న మృణాల్ నాని 30కి ఆ అమౌంట్ డబుల్ చేసి 4 కోట్లు తీసుకుంటుందంట. నాని 30 సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే మృణాల్ ఇప్పుడు ఏకంగా 6 కోట్లు డిమాండ్ చేస్తుందట. దాంతో మృణాల్ ని తీసుకుదామనుకున్న ప్రొడ్యూసర్లు మృణాల్ ప్లేస్ లో వేరే హీరోయిన్ లని తీసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే సీతని రాబోయే సినిమాల్లో చూడటం కష్టమే

- Advertisement -

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు