Honey Rose: బాలయ్య బ్యూటీకి ఎందుకు ఛాన్స్‌లు రావడం లేదు?

మలయాళ బ్యూటీ హానీ రోజ్.. ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. నిజానికి చాలా ఏళ్ల క్రిందే హానీ రోజ్ తెలుగులో సినిమాలు చేసింది. కానీ, అప్పుడు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, ఇటీవల నందమూరి నటసింహం బాలయ్య నటించిన వీర సింహా రెడ్డిలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. ఒక వైపు బాలయ్యతో రొమాన్స్ చేస్తూనే, మరో బాలయ్య పాత్రకు అమ్మ పాత్ర చేసింది. మా బావ మనోభావాలు దెబ్బతిన్నయి తో పాటు సినిమాలో బాలయ్యకు, హానీ రోజ్ కి మధ్య వచ్చిన సన్నివేశాలతో హనీ రోజ్ సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది.

అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్ లలో తన డ్రెస్ తో మీడియా ను ఆట్రాక్ట్ చేసింది. దీంతో ఈ బ్యూటీ తెలుగులో అవకాశాలు రావడం పెద్ద కష్టమేమీ కాదని అనుకున్నారు. కానీ వీర సింహారెడ్డి తర్వాత హానీ రోజ్ కి తెలుగులో ఏ ఒక్క సినిమా కూడా సెట్ కాలేదు. ఈ అందాల బొమ్మకి టాలీవుడ్ లో ఎందుకు ఛాన్స్ లు రావడం లేదని సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం హానీ రోజ్ మలయాళంలో పూక్కలం అనే సినిమాలో నటిస్తుంది. అలాగే అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వెళ్లి తన డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్రకారును రెచ్చగొడుతుంది. తాజాగా ఓ షాపింగ్ మాల్ కి వెళ్లిన హానీ రోజ్.. అక్కడ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. మెరిసే పింక్ కలర్ డ్రెస్ వేసుకున్న హానీ రోజ్.. అందాలు శ్రుతి మించాయని చెప్పొచ్చు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన తెలుగు ప్రేక్షకులు ఇంత అందాన్ని తెలుగు సినిమాల్లో ఎందుకు తీసుకోవడం లేదు అంటూ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు