Kollywood: అజిత్ – షాలిని విడిపోతున్నారా ? కారణం ఏంటి ?

అజిత్ కుమార్ అంటే ఒక కోలీవుడ్ హీరో మాత్రమే కాదు. సౌత్ లో మంచి గుర్తింపు, మార్కెట్ ఉన్న హీరో. అజిత్ నుంచి ఇటీవల వచ్చిన తునీవు (తెలుగులో తెగింపు) ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. అలాగే అజిత్ భార్య షాలిని.. ఈ తరం వారికి ఎక్కువగా తెలిసిఉండకపోవచ్చు. కానీ ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా 90వ దశకంలో చాలా మందికి పరిచయం.

వీరు ప్రేమించుకుని, 2000లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ స్టార్ జంటకి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరి గురించి ఓ వార్త కోలీవుడ్ వర్గాల్లో సంచలనాలను సృష్టిస్తోంది. దాదాపు 22 ఏళ్ల పాటు కలిసి కాపురం చేస్తున్న అజిత్ – షాలిని విడిపోవడానికి సిద్దమవుతున్నారట. ఇది ఒక కోలీవుడ్ లోనే కాదు మొత్తం సినీ ప్రపంచంలోనే హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజుల నుంచి అజిత్ – షాలినిల మధ్య గొడవలు జరుగుతున్నాయట.

ఈ మధ్య కాలంలో వారి మధ్య ఉన్న మనస్పర్థలు మరింత ఎక్కువయ్యాయని సమాచారం. దీంతో ఇద్దరు విడిపోవాలని, డైవర్స్ తీసుకోవాలని డిసైడ్ అయినట్టు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ వార్తలకు బలం చేకూరేలా డైరెక్టర్ రమేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. “అజిత్ – షాలిని లవ్ చేసుకున్న సమయంలో వద్దని చెప్పాను. కానీ, వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే భార్య, భర్తల మధ్య మనస్పర్థలు రావడం సహజం. వాళ్లు విడాకులు తీసుకుంటారని నేను అనుకోవడం లేదు. వారు తమ కాపురాన్ని కొనసాగిస్తారని నమ్ముతున్నాను” అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ అజిత్ ఫ్యాన్స్ ను మరింత ఆందోళనలో పడేశాయి.

- Advertisement -

కాగా, ఇటీవల విజయ్ దళపతి – సంగీత కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ రూమర్స్ వచ్చాయి. అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. మరి ఇప్పుడు అజిత్ – షాలిని విడాకులు వార్తలు రూమర్స్ గా మిగిలిపోతాయా ? నిజంగానే విడాకులు తీసుకుంటారా ? అని తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు