Mrunal : ఆ హీరో తో నెక్స్ట్ సినిమా

మృణాల్ ఠాకూర్, కొన్ని రోజుల క్రితం ఈ బాలీవుడ్ బ్యూటీ పేరు పెద్దగా వినిపించలేదు. కానీ హను రాఘవపూడి దర్శకత్వంలో ఇటీవల వచ్చిన సీతారామం సినిమాతో ఒక్క సారిగా ఈ పేరు మార్మోగిపోయింది. ఈ చిత్రంలో సీత పాత్ర చేసిన మృణాల్ ఠాకూర్ సినీ లవర్స్ గుండెల్లో ఒదిగిపోయింది. అప్పటి నుంచి మృణాల్ ఠాకూర్ ఒక బాలీవుడ్ హీరోయిన్ లా కాకుండా, పాన్ ఇండియా హీరోయిన్ లా చూస్తున్నారు.

ఈ చిత్రం తర్వాత మృణాల్ కు భారీ స్థాయిలో అవకాశాలు వస్తున్నాయి. సీతారామం తర్వాత ఇప్పటి వరకు మృణాల్ ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో NANI30 కూడా ఒకటి. ఈ ఆరు సినిమాల్లో మూడు షూటింగ్ ను పూర్తి చేసుకోగా, మరో రెండు సినిమాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఇక NANI30 చిత్రం చిత్రీకరణ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇదిలా ఉండగా, ఈ బాలీవుడ్ బ్యూటీ మరో అవకాశం వచ్చినట్టు సమాచారం అందుతుంది.

ఇప్పటి వరకు బాలీవుడ్, టాలీవుడ్ కే పరిమితమైన మృణాల్ కు కోలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చిందని టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ డ్రామా వస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే కథాపరంగా ఓ కీలక పాత్ర ఉంటుందట. ఈ పాత్ర కోసం సీతారామం బ్యూటీ మృణాల్ ను మూవీ యూనిట్ సంప్రదించారని తెలుస్తోంది. కథ నచ్చడం తో పాటు స్టార్ హీరో సూర్య మూవీ కావడంతో మృణాల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రారంభం కాబోయే కొత్త షెడ్యూల్ లో మృణాల్ ఠాకూర్ సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కాగా ఈ చిత్రానికి ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే దీనిలో సూర్య పలు విభిన్నమైన పాత్రల్లో దర్శనమిస్తాడని టాక్ వినిపిస్తోంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు