Jawan : ఆ విషయంలో భర్తను టార్చర్ పెడుతున్న నయనతార..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార మనందరికీ సుపరిచితమే. దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషకం డిమాండ్ చేస్తూ నయనతార లేడీ సూపర్ స్టార్ గా నిలిచింది. నాలుగు పదుల వయసులో కూడా ఇప్పటికీ ఫిట్నెస్ లో తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగుతోంది. ఈ బ్యూటీ పెళ్లి చేసుకుని సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చి.. ఇప్పటికీ హీరోయిన్ గా నటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

నటనపరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార.. రోజురోజుకు వయసుతోపాటు అందం కూడా పెంచుకుంటూ పోతుంది. అయితే తాజాగా నయనతార గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. తన భర్త విగ్నేష్ శివన్ ని నయనతార చాలా తిప్పలు పెడుతున్నట్లు తెలుస్తోంది. విగ్నేష్ శివన్ పిల్లల బాధ్యతలతో పాటు తన సినిమా బాధ్యతలను కూడా చూసుకుంటున్నప్పటికీ.. నయనతార మాత్రం ఎక్కువ సమయం సినిమాలతోనే గడుపుతోందట. కానీ విగ్నేష్ మాత్రం తన ఇద్దరు పిల్లలతో పాటు నయనతారని కూడా చూసుకుంటున్నాడట.

అంతేకాదు నయనతార అందం, ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. నయనతార ఉదయాన్నే యోగా చేస్తుందట. ప్రతిరోజు కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటుందట. ఇక డైట్ లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఖచ్చితంగా తీసుకుంటుందట. ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తోనే తన పొట్టని నింపుకుంటుందట.నయనతార ఓ వైపు సినిమాలు చేస్తూనే ఇంత డైట్ ని ఫాలో అవుతుంది. అయితే ఇదంతా విగ్నేష్ చేతిలోనే ఉందని తెలుస్తోంది. సమయానికి విగ్నేష్ నయనతార కి ఇవన్నీ సమకూర్చుతున్నారట. ఈ విషయం తెలిసిన నెటిజెన్లు భార్య అందం కోసం మామూలు తిప్పలు పడట్లేదని కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు