Pathaan : బాక్సాఫీస్ వద్ద విధ్వంసం

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనె జంటగా పఠాన్ అనే చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, జనవరి 25వ తేదీన విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్ లోకి వచ్చిన ఈ చిత్రం, మొదటి రోజు నుంచే రికార్డులను నమోదు చేస్తోంది. బాలీవుడ్ లో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకెళ్తుంది.

పఠాన్ విడుదలైన జనవరి 25వ తేదీన ఓపెనింగ్ కలెక్షన్లు రూ. 100 కోట్ల మార్క్ ను అందుకున్నాయి. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 106 కోట్ల వసూళ్లు చేసింది. రెండో రోజు కూడా ఎక్కడా తగ్గకుండా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 113.50 కోట్లను సంపాదించింది. తాజాగా మూడో రోజు కూడా పఠాన్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించింది. చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన తాజా లెక్కల ప్రకారం.. పఠాన్ మూవీ, మూడో రోజు 93.50 కోట్లను వసూళ్లు చేసింది.

అంటే మొత్తం మూడు రోజుల్లో పఠాన్ ప్రపంచ వ్యాప్తం రూ. 313 కోట్ల ను కొల్లగొట్టింది. బాలీవుడ్ లో ఒక చిత్రానికి ఇంత ఫాస్ట్ గా రూ. 300 కోట్ల కలెక్షన్లు రాలేవని బాలీవుడ్ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఈ వీకెండ్ నాటికి మరిన్ని రికార్డ్స్ ను క్రియేట్ చేయడం ఖాయమని అభిప్రాయపడతున్నారు. కాగా చాలా రోజుల గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన బాలీవుడ్ బాద్ షా, ఫర్మామెన్స్ పరంగా ఇరగదీశాడని ఫ్యాన్స్ అంటున్నారు.

- Advertisement -

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు