#PKSDT: సెట్స్‌పైకి పవర్ ఫుల్ కాంబో…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. అటు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే ఇటు రెగ్యూలర్ గా సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. కొన్ని రోజుల క్రితం రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ చేయడంతో ఆగిపోయిన ప్రాజెక్ట్ లను అన్నింటినీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న హరి హర వీరమల్లు షూటింగ్ ను పవన్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ముగింపు దశలో ఉందని సమాచారం.

దీంతో పాటు సాహో దర్శకుడు సుజిత్ తో #OG అనే సినిమాను అనౌన్స్ చేశాడు. అంతే కాదు.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ కూడా చేశాడు. అలాగే గతేడాది డిసెంబర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశాడు. అప్పుడే వినోదయ సీతం తెలుగు రీమేక్ ను కూడా పూజాతో ప్రారంభించాడు. ఇప్పటి వరకు పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి.

తాజాగా ఈ రోజు వినోదయ సీతం తెలుగు రీమేక్ ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా షూటింగ్ పనులను స్టార్ట్ చేసింది. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ పైకి రానుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు