Power Star : హిట్ కాంబినేషన్ మరో రీమేక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎమోషన్. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ కు పండుగ మొదలు అయినట్టే లెక్క. అయితే ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో చాలా బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. భీమ్లా నాయక్ తర్వాత పవన్ కొత్త సినిమా మళ్ళీ థియేటర్స్ లోకి రాలేదు. దాదాపుగా మూడు సినిమాలు పవన్ కళ్యాణ్ చేతులో ఉన్నాయి.

ప్రస్తుతం దర్శకుడు క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో పవన్ “హరి హర వీర మల్లు” సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం నుంచి త్వరలో టీజర్ ను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకిటించారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ దశలో ఉంది. దీనితో పాటు యంగ్ డైరెక్టర్ సుజీత్‌ తో కూడా సినిమాను చేయనున్నాడు పవన్ కళ్యాణ్.

ఇది ఇలా ఉండగా ఆర్ట్ డైరెక్టర్, పవన్ స్నేహితుడు ఆనంద్ సాయి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ సినిమా అని స్పష్టం చేసారు. అలాగే “వినోదయ సీతం” సినిమాను కూడా రీమేక్ పవన్ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

కానీ ఏ సినిమాను ముందుకు రీమేక్ చేస్తున్నారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. హరీష్ శంకర్ ఈ సినిమాపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట. పవన్ లుక్స్ ను కూడా మారుస్తున్నారట.ఇదివరకే దబాంగ్ మార్పులు చేసి గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ కొట్టిన హరీష్ శంకర్, ఇప్పుడు ఈ సినిమాకి చేసే మార్పులు ఎంతవరకు ప్లస్ అవుతాయో. ఈ సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు