Priyanka Jawalkar: ఆ హీరో తో సినిమా చేయను

హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ప్రియాంక కి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. ప్రియాంక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది.

అయితే ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోరు. కానీ ప్రియాంక జవాల్కర్ మాత్రం ఊహించని విధంగా సమాధానం చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నటించిన అన్ని సినిమాలు చూస్తానని చెప్పింది.

తమ్ముడు సినిమాని 20 సార్లు చూశానని.. ఖుషి చిత్రంలోని ప్రతి డైలాగ్ తనకి ఇప్పటికీ గుర్తుందని చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ కి తాను ఒక వీరాభిమానినని తెలిపింది ప్రియాంక. అయితే పవన్ సినిమాలో ఛాన్స్ వచ్చినా చేయను అని చెప్పింది. దానికి ఓ బలమైన కారణమే చెబుతుంది ప్రియాంక. ” పవన్ కళ్యాణ్ తో నటించాలని కోరికే నాకు లేదు. వీరాభిమానిగా పవర్ స్టార్ ని దూరం నుంచి చూడడం నాకు ఇష్టం. అంతకుమించి ప్రస్తుతానికి నేను ఏమీ ఆశించడం లేదు. ఆయనని దూరం నుంచి చూస్తూ, అభిమానిస్తూ ఉండిపోవాలి” అని తెలిపింది ప్రియాంక.

- Advertisement -

అంత పెద్ద స్టార్ అయినా కూడా పవన్ అంత సింపుల్ గా ఎలా ఉంటారో తనకు అర్థం కాదని చెప్పింది. ఇక ఈ ముద్దుగుమ్మకి ప్రస్తుతం అనిల్ రావిపూడి – నందమూరి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కబోయే చిత్రంలో ఒక హీరోయిన్ గా ఛాన్స్ దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు