Prabhas: రాం సీతా రాం.. సోల్ అఫ్ ఆదిపురుష్. ఈ ఒక్కటి చాలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఆది పురుష్ నుంచి రోజుకో అప్ డేట్ వదులుతూ సినిమాపై ఉన్న హైప్ ని అమాంతం పెంచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేయగా ఎక్కడో చిన్న వెలితి ఉండేది. దేశం గర్వించే మైథలాజికల్ కథని దర్శకుడు ఎలా తీయగలడు అనేది ఆడియన్స్ లో సందేహంగా ఉండేది. కానీ తాజాగా విడుదలైన ఆదిపురుష్ సోల్ సాంగ్ తో అన్ని అనుమానాలను పటాపంచెలు చేసేసాడు దర్శకుడు ఓం రౌత్.

“రాం సీతా రాం” అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ ను మే29 మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేసారు. పాట మొత్తం సీతా రాముల మధ్య ప్రేమానురాగాల అనుబంధం గురించి సాగుతుంది. సీత దూరమైనపుడు రాముడు పడే తపన ఇందులో ప్రతిఫ్రేమ్ లో దర్శకుడు చక్కగా చూపించాడు. అంతేకాదు సినిమాలో హీరోహీరోయిన్లపై మేకప్ జోలికి ఎక్కువ పోకుండా సింపుల్ గా చూపించడం బాగుంది. సీతారాముల కథ అంటే ప్రేక్షకులు ఇష్టపడేది ఎమోషన్స్ తో కూడిన డ్రామా మాత్రమే.

ఆదిపురుష్ టీజర్, ట్రైలర్ చూసినపుడు దర్శకుడు ఆ డ్రామాని మిస్ అయ్యాడని అనిపించింది. కానీ తాజాగా విడుదలైన ఈ పాటలో ఓం రౌత్ అన్ని సమపాళ్లలో తెరకెక్కిస్తున్నాడని అర్థమైంది. “రాం సీతా రాం” అంటూ హృద్యంగా సాగుతూ గుండె లోతుల్లోకి వెళ్ళిపోతుంది ఈ పాట. అయితే ఈ పాటకి సంబంధించి తెలుగులో మాత్రం అంత ఆదరణ లభించడం లేదు. ఎందుకంటే ఈ పాట మొత్తం డబ్బింగ్ పాటలాగా ఉండగా లిరిక్స్ కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. అయితే హిందీలో మాత్రం పాట వినసొంపుగా ఉంది.  తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా ఎంత కనెక్ట్ అవుతుందో తెలియదు గాని, హిందీ ప్రేక్షకులకి ఈ సినిమా ఏ మాత్రం మెప్పించినా అక్కడ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయం. ఈ పాట విడుదలైన ఒక్క గంటలోనే తెలుగు, హిందీలో కలిపి 3లక్షల లైక్స్ ని సొంతం చేసుకుందంటే పాటకు ఆడియన్స్ ఎంత కనెక్ట్ అయ్యారో అర్థం అవుతుంది. ఇక జూన్ 16న విడుదలవుతున్న ఈ చిత్రం ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు