Animal: రష్మిక ఎందుకింత ఎమోషల్ అయింది ?

నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉంటున్న విషయం తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడాలేవి లేకుండా అన్ని భాషల సినీ పరిశ్రమలలోను సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది.

నాగ శౌర్య హీరోగా నటించిన ఛలో సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచమైన ఈ కన్నడ బ్యూటీ మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తరువాత గీత గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలు చేసిన రష్మిక. మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరూ సినిమా చేయడంతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. రష్మిక చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన అందం, అభినయంతో ఇండియా వైడ్ గా పాపులారిటీ తెచ్చుకొని నేషనల్ క్రష్ ట్యాగ్ ని సొంతం చేసుకుంది.

కెరీర్ బిగినింగ్ లో కన్నడ, తెలుగు, తమిళ్ సినిమాలకే పరిమితం అయిన రష్మిక, ఇటీవలనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్ బాయ్ సినిమాతో నార్త్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇటీవలనే రష్మిక హిందీలో మిషన్ మజ్ను సినిమాలో నటించగా, ఈ సినిమా ఈ మధ్యనే నెట్ ఫ్లిక్స్ లో రిలీజయింది.

- Advertisement -

రష్మిక ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ హీరోగా వస్తోన్న యానిమల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో విలక్షణ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలనే ఈ సినిమా ప్రి టీజర్ రిలీజ్ అయ్యి, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

యానిమల్ సినిమాకి సంబంధించి రష్మిక 50 రోజులు షూటింగ్ చేసి ఇటీవలనే సినిమాలో తన పార్ట్ వర్క్ ని ఫినిష్ చేసినట్టు ఆమె తన షోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా ఆమె యానిమల్ సినిమా టీం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. సినిమా కోసం అందరు చాలా కష్టపడ్డారని చెప్తూ.. మొదట రణ్ బీర్ కపూర్ తో కలిసి నటించడానికి చాలా భయపడ్డానని తరువాత రణ్ బీర్ మంచితనం చూసి కంఫర్టబుల్ గా వర్క్ చేసానని, అలాగే సందీప్ రెడ్డి వంగ, అనిల్ కపూర్ లతో వర్క్ ఎక్స్ పీరియెన్స్ ను షేర్ చేసుకుంది. బాలీవుడ్ లో కబీర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా చేస్తుండటంతో యానిమల్ సినిమాపై భారీ అంచనాలున్నాయి, ఈ సినిమా వచ్చే ఆగస్ట్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు