Rashmika: విజయ్ దగ్గర చాలా నేర్చుకున్నా

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన వరిసు (వారసుడు) సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం.

ఈ చిత్రంలోని కథ మొత్తం హీరో చుట్టే జరుగుతుంది. ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ ఉండదు. రష్మిక మందన్న అందాల ఆరబోత చేసింది తప్ప పాత్రకి పెద్ద డెప్త్ లేదు. అయితే ఇలాంటి పాత్రను రష్మిక ఒప్పుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో తనపై వస్తున్న సెటైర్లపై రష్మిక మందన్న స్పందించింది. రష్మిక తాజాగా నటించిన చిత్రం మిషన్ మజ్ను.

ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక వారసుడు సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ.. విజయ్ దలపతి అంటే తనకి చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. వారసుడు సినిమాలో నటించడమే అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది రష్మిక. ఈ సినిమా కథ చెబుతున్నప్పుడే తన క్యారెక్టర్ అర్థమయిపోయిందని చెప్పింది. కేవలం సినిమాలో ఉన్న రెండు పాటలలోనే అదరగొట్టేయాలని డిసైడ్ అయ్యానని. అందుకే ఒప్పుకున్నానని తెలిపింది.

- Advertisement -

విజయ్ దగ్గర చాలా నేర్చుకున్నానని. వారసుడు సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చింది. ఒక నటిగా అన్ని పాత్రలు చేయాలని.. అందుకే ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటించానని తెలిపింది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు