Varisu : 200 కోట్ల క్లబ్ లో..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస హిట్ సినిమాలతో ముందుకు సాగుతున్నాడు ఈ స్టార్ హీరో. ఆయన నుంచి ఇటీవల వారిసు (తెలుగులో వారసుడు) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాతి పండుగ కానుకగా “వారిసు” సినిమాను విడుదల చేసారు. వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి, మరియు తూనీవు సినిమాలకు పోటీగా సంక్రాతికి ఈ చిత్రం విడుదల అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే మిశ్రమ టాక్ ను తెచ్చుకుంది.

కాగా.. రోజు రోజుకు పాజిటివ్ టాక్ ను దక్కించుకుని దూసుకెళ్తుంది. కుటుంబ కథాంశం తో సాగే ఈ సినిమా ఫామిలీ ఎంటర్టైనర్ గా ఈ పండుగ రేస్ లో నిలిచింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించలేక పోయింది. కానీ, తమిళంలో రికార్డులను తిరుగరాస్తుంది. వారిసు రిలీజ్ అయిన మొదటి వారంలోనే 200 కోట్ల క్లబ్ లో చేరింది. తలపతి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచినా సినిమాలు మెర్సల్, సర్కార్, బిగిల్ మరియు మాస్టర్. ఈ సినిమాల తర్వాత 210 కోట్లు సాధించిన ఐదో సినిమాగా “వారిసు” అని నిలిచింది.

వంశీ పైడిపల్లి చూపిన స్టోరీ లైన్ కు ఇంప్రెస్స్ అయిన ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తక్కువ కాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అన్నిపేరు తెచ్చుకున్న థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. థమన్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తలపతి విజయ్ కు జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు.

- Advertisement -

కాగా.. కలెక్షన్ల పరంగా దూసుకెళ్తున్న ఈ సినిమా ఇక ముందు మరెన్ని రికార్డులను తీరుగ రాయనుందో చూడాలి మరి.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు