Rashmika Mandanna: ఊపిరి పీల్చుకోవడం కూడా తప్పేనా ?

సినిమా ఇండస్ట్రీలో నటీనటులపై ట్రోల్స్ రావడం కామన్. ఆ ట్రోల్స్ సదరు నటీనటులను ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇది తెలిసిన కూడా కొంత మంది అదే పనిగా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ పై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె ఏ పని చేసినా, కొంత మందికి టార్గెట్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమె అసభ్యకరంగా ట్రోల్స్ కి గురవుతుంది. ఆమె ఎవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.

ఈ కన్నడ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది. తన నటన, అందంతో సౌత్ ఆడియన్స్ ను మెప్పించింది. ప్రేక్షకుల నుంచి నేషనల్ క్రష్ అని ముద్దుగా అనిపించుకుంది. కెరీర్ అంతా సాఫీగా నడుస్తున్న సమయంలో ఈమె కొంత మంది ట్రోల్స్ రాయుళ్లకు టార్గెట్ అయింది. దీంతో రష్మిక వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ఆమె ఎక్కడికి వెళ్లినా.. అది ఒక వార్తగా మిగులుతుంది.

నిజానికి ఈమెపై ట్రోల్స్.. కాంతార సినిమాపై వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి అని చెప్పొచ్చు. అయితేే దీనిపై రష్మిక చాలా సార్లు వివరణ ఇచ్చింది. ఇటీవల తన సినీ కెరీర్ బాగుండటానికి ప్రధాన కారణం.. రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి అని చెప్పి ముదురుతున్న వివాదానికి పులిస్టాప్ పెట్టడానికి ప్రయత్నించింది. వాళ్లకు థాంక్యూ అని కూడా చెప్పింది. అయినా ట్రోల్స్ రాయుళ్లు ఈమెను వదలలేదు. వరుస పెట్టిపై ఈ నేషనల్ క్రష్ పై ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.

- Advertisement -

తనపై వస్తున్న ట్రోల్స్ పై నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి స్పందించింది. “నా పై ఎందుకు ఇంత ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ఎక్కువగా వర్కౌట్స్ చేస్తే అబ్బాయిలా కనిపిస్తానని అంటారు. ఒక వేళ తక్కువ వర్కౌట్ చేస్తే లావు అవుతున్నాను అని ట్రోల్స్ చేస్తారు. ఏ అంశం పైనే అయినా దైర్యంగా మాట్లాడితే పొగరు ఎక్కువ అని విమర్శిస్తారు. ఒకవేళ మౌనంగా ఉంటే, ఒక నటి ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదని అంటారు.నేను ఊపిరి పీల్చుకున్నా కూడా కొందరు తప్పే అంటున్నారు” అంటూ వాపోయింది.

నటీనటుల కూడా మనుషులే అని, వారికి కూడా మనసు ఉంటుందని వివరించింది. ఇటీవల కాలంలో తనకు సోషల్ మీడియాను ఎదుర్కొవడం పెద్ద సవాళుగా మారిందని చెప్పుకొచ్చింది.

For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు