RRR for Oscar: దానయ్య దాస్తున్నాడా.. ?

ఇటీవల RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ లభించిన విషయం తెలిసిందే. ఆస్కార్ అవార్డ్ వల్ల భారత దేశ చలన పరిశ్రమ విశిష్టతను ప్రపంచానికి చాటింది తెలుగు పరిశ్రమ. అయితే ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చన క్రమంలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కొన్ని రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ ప్రమోషన్ల కోసం రాజమౌళి అండ్ టీం భారీ స్థాయిలో ఖర్చు చేశారని మీడియా కోడై కూసింది.

టాలీవుడ్ లో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా ఆస్కార్ ప్రమోషన్స్ ఖర్చులపై సంచలన వ్యాఖ్యాలు చేసాడు. RRR ఆస్కార్ ప్రమోషన్స్ కోసం US లో దర్శకుడు రాజమౌళి 80 కోట్లు ఖర్చు చేసాడని. అలా ప్రమోషన్స్ కోసం అంత డబ్బులు ఖర్చు చేసే బదులు వేరే సినిమాల కోసం చేస్తే సరిపోతది కదా అని అన్నాడు. దీనిపై నాగబాబు “నీ అమ్మ మొగుడు… ” అంటూ స్పందించడంతోపాటు రాఘవేంద్ర రావు కూడా కామెంట్ చేయడంతో కొన్ని రోజుల పాటు ఈ వివాదం సాగింది.

తాజాగా ఆస్కార్ ప్రమోషన్స్ డబ్బుల ఖర్చు చేయడంపై ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య స్పందించాడు. “ఖర్చుపై చేసే వాళ్లు నా బ్యాంక్ స్టేట్ మెంట్ ఏమైనా చూశారా..? ఈ వార్తలను ఖండిస్తున్నాను” అంటూ కామెంట్ చేశారు. అలాగే చిరంజీవి ఇన్వెస్ట్ చేసినట్టు వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదంటూ చెప్పుకొచ్చారు. అయితే డీవీవీ దానయ్య ఆస్కార్ ఖర్చుపై స్పందించిన ఈ వార్తలకు బ్రేకులు పడటం లేదు. దానయ్య ఏదో దాస్తున్నాడు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు