Samantha : ప్రమోషన్లకు భారీ ప్లాన్

టాలీవుడ్ లోనే కాదు.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఎవరంటే.. మొదట వచ్చే సమాధానం సమంత రుత్ ప్రభు. ఏమాయ చేశావే సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైన సమంత.. ఆ తర్వాత వరుసగా తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంటూ అదరగొడుతుంది. కెరీర్ లో చాలా సక్సెస్ లు అందుకున్న సామ్ ఇటీవల యశోద అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

దీని తర్వాత సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమా శాకుంతలం. మహాక‌వి కాళిదాసు ర‌చించిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ప్రముఖ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న విజువ‌ల్ వండ‌ర్‌ మూవీ శాకుంతలం. గుణ శేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమా ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. అలాంటి ప్యాషన్ గల గుణ శేఖర్ ఈ సినిమాకు దర్శకుడు కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అలాగే పౌరాణిక ప్రేమ కావ్యం కావడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది.

కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. కాగా, సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీని వల్లే యశోద ప్రమోషన్లకు కూడా సామ్ రాలేదు. అయితే ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి సామ్ వరకు కోలుకుంది. కొంత కష్టమైన ఇటీవల శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు వచ్చింది. ప్రమోషన్లకు కూడా సామ్ టైమ్ ఎక్కువగానే ఇస్తుందట. ఒక తెలుగులోనే కాదు, బాలీవుడ్ ప్రమోషన్లకు కూడా స్వయంగా సమంత పాల్గొనబోతుందని తెలుస్తోంది.

- Advertisement -

హిందీ ప్రేక్షకుల్లో సౌత్ సినిమాలపై మంచి అభిప్రాయం ఉంది. పైగా శాకుంతలం పౌరాణిక సినిమా కాబట్టి, హిందీ బెల్ట్ రాష్ట్రాల ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. దీంతో ప్రమోషన్లను గట్టిగా చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అందుకోసమే, సమంత కొంత ఇబ్బంది అయినా, ముంబై ప్రమోషన్ లలో కూడా పాల్గొంటుందని తెలుస్తుంది.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు