Samantha About Divorce: చేయని తప్పునకు నేనేందుకు బాధ పడాలి?

సమంత – నాగ చైతన్య డైవర్స్.. రెండేళ్ల క్రితం టాలీవుడ్ తో పాటు సినీ ప్రపంచాన్ని షేక్ చేసిన న్యూస్ ఇది. రెండేళ్లు గడిచిన గానీ, దీని గురించి మీడియాలో, సోషల్ మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. చాలా ఏళ్లుగా ఒకరినొకరు గాఢంగా ప్రేమించికున్న ఈ స్టార్ కపుల్ ఎందుకు ఎందుకు విడాకులు తీసుకున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటి వరకు రాలేదు. సందర్భాన్ని బట్టి, సమంతను, నాగ చైతన్య డైవర్స్ గురించి అడిగిన ప్రతిసారి సరైన ఆన్సర్ రాలేదు.

అయితే తాజాగా తన డైవర్స్ విషయంపై సమంత స్పందించింది. శాకుంతలం మూవీ ప్రమోషన్లలో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన డైవర్స్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. “నేను పెళ్లి అనే బంధంలో 100 శాతం నిజాయితీగా ఉన్నాను. కానీ, అది నాకు ఎందుకో వర్కౌట్ కాలేదు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే నాగ చైతన్యతో బ్రేకప్ అయిన తర్వాత పుష్ప సినిమాలో “ఉ అంటవా మావా…” సాంగ్ లో ఛాన్స్ వచ్చిందని చెప్పింది. “డైవర్స్ అయిన వెంటనే ఐటెం సాంగ్ చేస్తే, అందరూ చెడుగా అనుకుంటారు. కొద్ది రోజులు ఇంట్లోనే ఉండు.. ఇంట్లోనే కూర్చో..” అంటూ కొంతమంది బంధువులు, స్నేహితులు చెప్పారని వివరించింది.

కానీ, “చేయని తప్పునకు నేను ఎందుకు బాధపడాలి ? ఎందుకు శిక్ష అనుభవించాలి ? తప్పు చేసిందానిలా ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలి ? అని అనుకున్నాను. అందుకే ఆ పాట చేశాను” అంటూ చెప్పుకొచ్చింది. సన్నిహితుల మాటను కాదని పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి కారణం ఉందని సామ్ చెప్పింది. “నా వైవాహిక జీవితంలో 100 శాతం నిజాయితిగా ఉన్నాను. అలాంటి సమయంలో నేను ఎందుకు దాక్కొవాలి” అని సామ్ ప్రశ్నించింది.

- Advertisement -

“మయోసైటీస్ వచ్చిన సమయంలో చాలా ఇబ్బందులను ఫేస్ చేశానని, ఒక నటిగా కళ్లతో హావాభావాలు పలకాల్సిన నేను.. కళ్లను క్లాసెస్ తో కవర్ చేసుకునే స్థితికి వచ్చాను. కళ్లజోడు పెట్టుకుని బయటకిపోవడానికి నాకు ఇష్టం ఉండదు. కానీ మయోసైటీస్ వల్ల, అలా చేయాల్సి వచ్చింది. మయోసైటీస్ వ్యాధికి తీసుకున్న చికిత్స వల్ల నా శరీరం అనేక రకాలుగా మారిపోయింది. ఒక్క సారిగా బరువు పెరగడం, తగ్గిపోవడం లాంటి మార్పులు జరిగాయి. ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకుడదు” అంటూ తన అనుభవించిన సమస్యలను తెలిపింది. గత ఎనిమిది నెలలుగా పోరాడుతున్నాని, పూర్తి ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్తున్నట్టు ఈ ఇంటర్వ్యూలో సామ్ చెప్పింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు