Samantha: సమ్మర్ బరిలో ” శాకుంతలం “

తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా సమంతకి ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. అయితే సమంత నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ శాకుంతలం. ఈ సినిమా కోసం అభిమానులంతా వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

కాళిదాసు రచించిన “అభిజ్ఞానశాకుంతలం” ఆధారంగా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శకుంతలగా సమంత నటించిన ఈ సినిమాలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ కనిపించనున్నారు. నిర్మాణ భాగస్వామిగా దిల్ రాజు ఉన్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో పాటను విడుదల చేస్తూ వస్తుంది మూవీ యూనిట్.

అయితే, తాజాగా ఈ సినిమా బిగ్ అప్డేట్ వచ్చింది. “శాకుంతలం” మూవీ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అంటే శాకుంతలం సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది అన్నమాట.  కాగా ఫిబ్రవరి 17న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా, ఆ డేట్ ను రిలీజ్ చేయలేమని ఇటీవలే పేర్కొంది చిత్రబృందం. కానీ తాజాగా ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించింది. ఈ అప్డేట్ తో సమంత ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా సమంత ఇటీవల చేసిన యశోద సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

For More Updates :

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు