Samyuktha Menon: సక్సెస్ ను కొనసాగిస్తోంది..

సౌత్ సినిమా ఇండస్ట్రీ కి సంయుక్త మీనన్ సుపరిచితమే. పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ సినిమా తో తెలుగు తెరకి పరిచయం అయింది ఈ ముందు గుమ్మా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వచ్చాయి. అలాగే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.  భీమ్లా నాయక్ తో సంయుక్తకు మొదటి హిట్ వచ్చింది.

దీని తరువాత పృథ్వి రాజ్ సరసన ”కడువ” అనే మలయాళం సినిమా లో నటించి రెండవ హిట్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా, నందమూరి కళ్యాణ్ రామ్ తో కలిసి ”బింబిసార” సినిమాతో మళ్ళి తెలుగు తెరలో మెరిసి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతా లో వేసుకుంది ఈ భామ. తెలుగు, మలయాళం మాత్రమే కాకా, ‘గాలిపాట 2’ అనే సినిమాతో కన్నడ లో కూడా హిట్ సొంతం చేసుకుంది.

ఇలా పట్టిందల్లా బంగారం అయినట్టు , 2022 లో చేసిన ప్రతి సినిమా హిట్ అయింది. ఇక సక్సెస్ ఫుల్ హీరోయిన్ 2023లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సరసన ”సార్” సినిమా చేసింది. ఈ ఏడాది ఇది ఈమెకు తొలి సినిమా. గతేడాది వరుస హిట్స్ తో మంచి జోష్ పై ఉన్న సంయుక్త మీనన్ కు ఈ ఏడాది ఎలా ఉంటుంది అని తన అభిమానుల్లో చిన్నపాటి టెన్షన్ ఉండేది. నేడు విడుదలైన ఈ సార్ మూవీ.. మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది.

- Advertisement -

ఈ సినిమా ప్రీమియర్ షో ల నుంచే మంచి రెస్పాన్స్ రాగా, పాజిటివ్ రివ్యూలను కూడా తెచ్చుకుంటుంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వడం దాదాపు ఖాయమే అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఈ భామ కెరీర్ లో వరుసన 5వ హిట్. ఈ సినిమా కూడా హిట్ అయితే, సంయుక్త కి తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ఖాయం అయ్యేలా ఉంది.

ఇక ఈ మలయాళీ బ్యూటీ మేకర్స్ కు ఫస్ట్ ఛాయస్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ హిట్ ట్రాక్ రికార్డు తో ఈ భామ కు ఉన్న క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు