Unstoppable: మెగా స్టార్ పక్కా

తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటులు అంటే వెంటనే మెగా స్టార్ చిరంజీవి, నందమూరి బాల కృష్ణ పేర్లే గుర్తొస్తాయి. కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమను ఏలుతున్నాడు ఈ అగ్ర నటులు.

అటు నందమూరి ఫ్యాన్స్ ఇటు మెగా స్టార్ ఫ్యాన్స్ వీరిద్దరూ ఒక స్టేజి మీద కనిపిస్తే చూడాలి అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గతంలో వీరిద్దరూ ఒక స్టేజిపైన కలిపించిన సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు చిరంజీవి, బాలయ్య సంక్రాంతి కానుకగా విడుదల చేసిన సినిమాలు వాల్తేరు వీరయ్య, వీర సింహ రెడ్డి అందుకున్న సక్సెస్ మాటల్లో చెప్పలేనిది.

అయితే ఈ సందర్భంలో వీరిద్దరూ ఒకే స్టేజి మీద కనిపిస్తే చూడాలి అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు. ఇప్పుడు బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె అనే టాక్ షో 2వ సీసన్ ఆహా లో స్ట్రీమ్ అవుతుంది.

- Advertisement -

ఈ షోకి మెగా స్టార్ ని గెస్ట్ గా తీసుకొని రావాలని ఆహా టీం, అల్లు అరవింద్ చాల రకాలుగా ప్రయత్నిస్తున్నారని గతంలో వార్తలు వినిపించాయి. దానితో ఈ కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసారు. అయితే ఈ సీజన్ లో లాస్ట్ ఎపిసోడ్ కూడా వచ్చేస్తోంది కానీ మెగా స్టార్ మాత్రం షో కి రాలేదు.

ఈ విషయం పైన ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. తాజాగా ఈ విషయం పైన ఆహా టీం స్పందిస్తూ, “అన్ స్టాపబుల్ రెండో సీజన్ కు మెగాస్టార్ చిరంజీవిని తీసుకురావడానికి చాలా ట్రై చేశాం. కానీ, కొన్ని సమీకరణాల వల్ల అది కుదరలేదు. కానీ, మూడో సీజన్ కి మెగాస్టార్ ను తప్పకుండా.. తీసుకువస్తాం.”అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గురించి స్పందిస్తూ.. “రేపు రాత్రి 9 గంటలకు ఫస్ట్ పార్ట్ ను రిలీజ్ చేస్తాం. రెండో పార్ట్ ను అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం” అని వివరించారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ స్టాపపబుల్ రెండో పార్ట్ శివరాత్రి సందర్భంగా విడుదల చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

కొన్ని దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఈ అగ్ర నటులు, ఒకే స్టేజి మీద ఎప్పుడు కనిపిస్తారో అని ప్రేక్షకులు ఎన్నో అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఇక ఆహా టీం చేప్పినట్టుగా 3వ సీజన్లో అయినా మెగా స్టార్ ని గెస్ట్ గా తీసుకొస్తారో లేదో అని వేచి చూడాల్సి ఉంది.

 

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు