Devil: నందమూరి హీరో కోసం ఫారన్ బ్యూటీ

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం అంటే.. బింబిసార. ఇలాంటి హిట్ అందుకోవడానికి కళ్యాణ్ రామ్ కి చాలా ఏళ్లు పట్టింది. ఈ సక్సెస్ ను కొనసాగించాలని కళ్యాణ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో వచ్చిందే.. అమిగోస్. డొపెల్ గేంగర్స్ (మనుషులను పోలిన మనుషులు ఉండటం) అనే విభిన్నమైన స్టోరీతో ఈ అమిగోస్ వచ్చింది. కానీ, ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.

దీంతో బింబిసారతో వచ్చిన సక్సెస్ క్రేజ్ ను కోల్పోయాడు. మళ్లీ తన స్టేటస్ తీసుకురావడానికి ఈ నందమూరి హీరో సిద్ధమవుతున్నాడు. కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమా ‘డెవిల్‘ తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. డెవిల్ సినిమాను కూడా ప్రేక్షకులను మెప్పించేలా.. తీయాలని కళ్యాణ్ రామ్ కసరత్తులు చేస్తున్నాడు.

ఈ కథ బ్రిటీష్ కాలంలోనిదని, బ్రిటీషర్స్ కి చెందిన సీక్రెట్ ఏజెంట్ గురించని తెలుస్తోంది. ఈ సినిమాను నవీన్ మేడారం అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా డెవిల్ సినిమా గురించి ఒక అప్డేట్ వస్తుంది. అది ఏంటంటే సినిమా లో ఒక ప్రత్యేక గీతం కోసం ఇరాన్ నటి ఎల్నాజ్ నోరొజీని మూవీ టీం ఎంపిక చేసినట్టు తెలుస్తుంది.

- Advertisement -

హిందీ వెబ్సెరీస్ సాక్రేడ్ గేమ్స్ తో పేరు పొందిన ఎల్నాజ్ గతేడాది హిజాజ్ కు వ్యతిరేకంగా దుస్తులు విప్పేసి నిరసన వ్యక్తం చేసింది. దీంతో ఈమె మరింత వైరల్ అయింది. తాజాగా ఈమెను డెవిల్ మూవీలో భాగం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈమె చేయబోయే ఐటెం సాంగ్ కోసం మూవీ యూనిట్ ఏకంగా 3 కోట్లతో ఒక భారీ సెట్ తయారు చేసినట్లు తెలుస్తుంది. మరి కళ్యాణ్ రామ్ సినిమాకు ఎంత మేరకు ఉపయోగపడతుంది చూడాలి మరి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు