Dasara: కిర్తీ సురేష్ దూరంగా ఉందా.. దూరం పెట్టారా ?

ఇటీవల కాలంలో తెలుగులో వచ్చే సినిమాలకు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. అలాగే నాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న దసరా సినిమాపై కూడా తెలుగు రాష్ట్రాలు, సౌత్ ఇండస్ట్రీ తో పాటు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది.. శ్రీకాంత్ ఓదెల. ఈయనకు ఇది మొదటి సినిమా అయినా, భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే దసరా సినిమా నాని కెరీర్ లోనే పెద్ద ఫిలిం అని చెప్పొచ్చు. ఈ సినిమా నాని కెరీర్ లోనే హై బడ్జెట్ ఫిలిం కూడా.

నాని ఇప్పటి వరకు పక్కంటి కుర్రాడిలా, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ హీరోగా సినిమాలు చేశాడు. మొదటి సారి పక్క మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే నాని కి ఇది మొదటి పాన్ ఇండియా ఫిలిం కాబట్టి, దీని ప్రమోషన్స్ కోసం నాని బాగా కష్టపడుతున్నాడు. RRR సినిమా కి ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలాగైతే ప్రతి స్టేట్ కి స్వయంగా ప్రమోషన్స్ చేశారో, నాని కూడా అదే దారి ఫాలో అవుతున్నాడు.

అయితే దసరా ప్రమోషన్స్ లో హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రం కనిపించడం లేదు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో గానీ, ఇతర ఇంటర్వ్యూలో గానీ ఈ మహానటి కనిపించడం లేదు. దసరా అంటే కేవలం నాని అన్నట్టు గానే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మూవీలో కీర్తి సురేష్ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. కీర్తి లుక్ కూడా ప్రతి సారి కంటే భిన్నంగా ఉంది.

- Advertisement -

అయినా, కీర్తి సురేష్ ప్రమోషన్లకు దూరంగా ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయని టాక్ వస్తుంది. మూవీ టీం కావాలనే కీర్తిని ప్రమోషన్లకు దూరంగా పెడుతున్నారంటూ గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే కీర్తి సురేష్ ప్రస్తుతం చిరంజీవి సినిమా లో బిజీగా ఉందనువల్లే దసరా ప్రమోషన్స్ కి దూరంగా ఉందేమో అని కూడా విశ్లేషకులు అంటున్నారు.

మరి ఇప్పుడైనా ఇంటర్వ్యూలకు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహానటి వస్తుందో రాదో చూడాలి మరి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు