Janhvi Kapoor: చరణ్ సరసన.?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న చరణ్, ఇప్పుడు శంకర్ తోనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అలాగే ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబుతో కూడా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మొన్న ఆ మధ్య బుచ్చిబాబు సినిమా గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా.

ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తోను మరో లవ్ స్టోరీ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. శంకర్ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చరణ్ కు జోడిగా అందాల భామ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తుందని అంటున్నారు. జాన్వి కపూర్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ 30 సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్న విషయం తెలిసిందే.

కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఇటీవల జాన్వి కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్రబృందం. దానితో పాటే ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలోని హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు