SSMB28: పవన్ – మహేష్ అభిమానులు ట్విట్టర్ వార్ కి సిద్ధమా..

కాలం మారుతున్న కొద్దీ కొన్నిటిలో మార్పు వస్తుంది అంటారు అలానే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు సంభవించాయి. ఒకప్పుడు ఏ హీరో అభిమానులైన థియేటర్ దగ్గర ఆర్గుమెంట్స్ లేదంటే పెద్ద పెద్ద బ్యానర్స్ కడుతూ వాళ్ళ అభిమానాన్ని చాటుకునేవారు. ఒక సినిమా ఎన్ని రోజులు ఆడింది ఎన్ని సెంటర్లు ఆడింది అనేది ఒకప్పుడు రికార్డుగా పరిగణించేవారు.

కానీ ఇప్పుడు ఒక సినిమా ఎంత కలెక్ట్ చేసింది యూట్యూబ్లో ట్రైలర్ పెట్టగానే ఇన్ని వ్యూస్ సంపాదించింది టీజర్ కి ఎన్ని రీ ట్వీట్స్ వచ్చాయి. పోస్టర్ కి ఎంతలా ట్రెండ్ అయింది అనేది ఒక ట్రెండ్ గా మారింది. ప్రస్తుత జెనరేషన్ లో ఒక స్టార్ హీరో ఏదైనా ఒక కొత్త సినిమా అప్డేట్ ఉంటే చాలు ట్విట్టర్ మొత్తం ఆ స్టార్ హీరో యొక్క సినిమా హడావిడే ఉంటుంది. అలానే ఈసారి కూడా ట్విట్టర్లో మరో మారు వార్ జరగనుందా అంటే? అవుననే చెప్పాలి.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కి ఉన్న స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మహేష్ అభిమానులు ఒక ట్రెండ్ సెట్ చేస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు దాన్ని ఎప్పుడూ బీట్ చేస్తూ ఉంటారు ఇది కేవలం ట్విట్టర్ ట్రెండ్ విషయంలోనే కాకుండా సినిమా రిలీజ్ విషయంలో కూడా ఇలానే జరిగింది. మహేష్ అభిమానులు పోకిరి సినిమాతో ఒక ట్రెండ్ సెట్ రీ రిలీజ్ చేస్తే, దాన్ని దాటి జల్సా సినిమాతో ఆ రీ రిలీజ్ ట్రెండ్ ని పీక్ కి తీసుకెళ్లారు పవన్ ఫ్యాన్స్.

- Advertisement -

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సముద్రఖని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ తో పాటు పీకేఎస్డిటి సినిమా చేస్తున్నాడు. అలానే స్టార్ హీరో మహేష్ బాబు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB 28 సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల అప్డేట్స్ ఉగాదికి ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఒక స్టార్ హీరో సినిమా అప్డేట్ తోని ఆ రోజంతా ట్విట్టర్లో హడావిడి జరుగుతుంది అలాంటిది ఇద్దరి స్టార్ హీరోల సినిమా అప్డేట్లు ఒకే రోజొస్తే ఆ వారెలా ఉండబోతుందో ఉగాది నాడు తెలియనుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు