Tollywood: హను నెక్స్ట్ సినిమా ఎవరితో ?

అందాల రాక్షసి సినిమా తో డైరెక్టర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి, కృష్ణ గాడి వీరప్రేమ గాధ తో మంచి విజయాన్ని పొంది, తెలుగులో మంచి అభిరుచి గల దర్శకుడి గా గుర్తింపు తెచ్చుకున్నాడు హను రాఘవ పూడి. ఆ తర్వాత ఇతను తీసిన లై, పడి పడి లేచే మనసు అంతగా ఆడకపోయినా దర్శకుడిగా ఈయనకి మంచి పేరు తెచ్చి పెట్టాయి. ఇక రీసెంట్ గా “సీతారామం” మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి తన డైరెక్షన్ టాలెంట్ ఏంటో చూపించాడు. ఈ సినిమా హను రాఘవపూడి కి నేషనల్ వైడ్ గా మంచి గురింపు తెచ్చి పెట్టింది. లై మినహా మిగతా అన్ని మూవీస్ ప్రేమకథలు కావడం విశేషం.

అయితే సీతారామం సినిమా తర్వాత హను రాఘవపుడి ఇంకా ఏ సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. ఈ సినిమా లో హీరోగా నటించిన దుల్కర్ సల్మాన్ మలయాళం మూవీస్ లో బిజీ గా ఉండగా, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నాని30 వ సినిమాలో నటిస్తుంది. ఇక సీతారామం నిర్మించిన వైజయంతి మూవీస్ ఇతర ప్రాజెక్టులతో బిజీ అయింది. కానీ హను మాత్రం వేరే సినిమాతో ముందుకు రాలేదు. అయితే హను రాఘవపూడి ఖాళీగా లేడని తన నెక్స్ట్ మూవీకి సంబంధించి కథ విషయం లో కసరత్తులు చేస్తున్నాడని, ఇప్పటికే పలువురు ప్రొడ్యూసర్స్ ని సంప్రదించాడని హను రాఘవపూడి అసిస్టెంట్ ద్వారా సమాచారం అందింది.

అయితే హను రాఘవపూడి తన నెక్స్ట్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ తో సినిమా చేస్తున్నాడంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ సినిమా లో రామ్ చరణ్, లేదా నాని హీరోగా నటించవచ్చని అంటున్నారు. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ ఇంకా బుచ్చి బాబు తో ఒక మూవీ ని చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు రిలీజ్ అవడానికి రెండేళ్లు పడుతుంది. ఇక నాని ప్రస్తుతం తన 30 వ సినిమా చేస్తున్నాడు. వేరే సినిమా ఇంకా అనౌన్స్ చేయలేదు. కాబట్టి నాని తో ఈ సినిమా చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ రోజు అనగా ఏప్రిల్ 19 హను రాఘవపూడి బర్త్ డే. కాబట్టి ఏదైనా మూవీ ప్రొడక్షన్ టీమ్ హను రాఘవపూడి తో సినిమా అనౌన్స్ చేయవచ్చు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు